చుండ్రుతో విసిగిపోయారా.. ఎన్ని చేసినా వదలట్లేదా.. అయితే ఇదే మీకు బెస్ట్ రెమెడీ?

చుండ్రు( Dandruff ). కోట్లాది మందిని కలవర పెట్టే సమస్యల్లో ఇది ఒకటి.

 Super Effective And Powerful Remedy For Dandruff!, Dandruff, Dandruff Removing R-TeluguStop.com

చుండ్రుకు కారణాలు అనేకం.వేడి వేడి నీటితో తల స్నానం చేయడం, వాతావరణంలో వచ్చే మార్పులు, కాలుష్యం, ఒత్తిడి తదితర కారణాలు వల్ల చుండ్రు సమస్య ఏర్పడుతుంది.

ఈ క్రమంలోనే చుండ్రును వదిలించుకోవడం కోసం మార్కెట్ లో లభ్యమయ్యే ఖరీదైన షాంపూలను కొనుగోలు చేసి వాడుతుంటారు.తోచిన చిట్కాలు అన్నీ ప్రయత్నిస్తుంటారు.

అయితే ఎన్ని చేసినా ఒక్కోసారి చుండ్రు అస్సలు వదిలిపెట్టదు.దీంతో చుండ్రుతో బాగా విసిగిపోతుంటారు.

మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు ది బెస్ట్ గా పని చేస్తుంది.

Telugu Dandruff, Dandruff Remedy, Care, Care Tips, Healthy Scalp, Remedy, Latest

ఈ రెమెడీని పాటిస్తే కేవలం రెండు మూడు వాషుల్లోనే చుండ్రు మొత్తం మాయం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో గుప్పెడు తులసి ఆకులు( Tulsi Leaves ), రెండు రెబ్బలు వేపాకు, వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఉసిరికాయ పొడి( Amla Powder ), వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకోవాలి.

అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న వాటర్ ను సరిపడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Dandruff, Dandruff Remedy, Care, Care Tips, Healthy Scalp, Remedy, Latest

గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని( Dandruff Remedy ) పాటిస్తే చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే దెబ్బకు పరార్ అవుతుంది.కేవలం రెండు లేదా మూడు వాషుల్లోనే స్కాల్ప్ శుభ్రంగా ఆరోగ్యంగా మారుతుంది.అంతేకాదు ఈ రెమెడీని పాటించడం వల్ల జుట్టు కుదుళ్లు స్ట్రాంగ్ గా మారుతాయి.హెయిర్ గ్రోత్( Hair Growth ) ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు త్వరగా తెల్లబడకుండా సైతం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube