నెయ్యి.పాల నుంచి వచ్చేదే అయినా, పాల కంటే రుచిగా ఉంటుంది అనడంలో సందేహమే లేదు.
అందుకే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ నెయ్యిని అమితంగా ఇష్టపడుతుంటారు.వంటల్లో కూడా విరి విరిగా నెయ్యిని ఉపయోగిస్తుంటారు.
అలాగే ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలా అనేక పోషకాలను కూడా నెయ్యి కలిగి ఉంటుంది.ఇక నెయ్యి చర్మ సంరక్షణలోనూ గ్రేట్‌గా సహాయపడుతుంది.
ముఖ్యంగా పెదవులను న్యాచురల్‌గానే పింక్‌గా, షైనీగా మార్చడంలో నెయ్యి అద్భుతంగా ఉపయోగపుడుతుంది.మరి నెయ్యిని పెదవులకు ఎలా యూజ్ చేయాలో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని.అందులో ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ పచ్చి పాలు తీసుకుని బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి.పావు గంట పాటు డ్రై అవ్వనివ్వాలి.
అనంతరం వేళ్లతో మెల్ల స్క్రబ్ చేసుకుంటూ చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే.
మురికి, మృతకణాలు పోయి పెదవులు లేత గులాబీ రంగులోకి మారతాయి.
అలాగే ఒక బౌల్ తీసుకుని.
అందులో ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ బీట్ రూట్ రసం మరియు రెండు చుక్కల బాదం వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదాలకు పూసి.
పది నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా కూడా పెదవులు పింక్‌గా, షైనీగా మారతాయి.
ఇక ఒక గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి, అర స్పూన్ శెనగ పిండి మరియు అర స్పూన్ పాలు వేసి కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని లిప్స్‌కు పట్టించి.ఇరవై నిమిషాల తర్వాత వేళ్లతో రుద్దుకుంటూ క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.