మామూలుగా నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో అయ్యప్ప మాల శివమాల గోవింద మాల భవాని మాల అంటూ రకరకాల మాలలు వేస్తూ ఉంటారు.ఆ తరువాత అయ్యప్ప మాల వేసిన వారు శబరిమలకు శివమాల వేసిన వారు శ్రీశైలంకి గోవింద మాల వేసిన వారు తిరుపతి కీ వెళుతూ ఉంటారు.
ఆ సంగతి పక్కన పెడితే సామాన్య వ్యక్తులతో పాటు సినిమా ఇండస్ట్రీలోని వారు కూడా అప్పుడప్పుడు మాల వేస్తూ ఉంటారు.ముఖ్యంగా ఆమెగా ఫ్యామిలీలో చిరంజీవి ( Chiranjeevi )అయ్యప్ప మాల వేస్తూ ఉంటారు.
గతంలో చాలా సార్లు చిరంజీవి అయ్యప్ప మాలలో కనిపించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు చిరంజీవి తర్వాత ఆయన తనయుడు రామ్ చరణ్ ( Ram Charan )కూడా అయ్యప్ప మాల ధరిస్తున్నారు.ఎంత బిజీగా ఉన్నా, ఏ సినిమాల్లో నటిస్తున్నా, విదేశాల్లో ఉన్నా రామ్ చరణ్ అయ్యప్ప మాల ధరించడం అనేది మనం చూస్తూ ఉంటాం.ఈసారి చరణ్ మాలలో ఉన్నారు.
ఇటీవల బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో కనిపించిన చరణ్ అయ్యప్ప మాలలోనే ఉన్న విషయం తెల్సిందే.అయ్యప్ప మాల ధరించి ఉన్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా( A game changer movie ) ప్రమోషన్‌లో భాగంగా యూఎస్‌ఏ కి వెళ్లబోతున్నారట.
డల్లాస్ లో జరగబోతున్న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యూనిట్ సభ్యులతో కలిసి యూఎస్ ఫ్లైట్ ఎక్కబోతున్నారు.
మాలలోనే చరణ్ యూఎస్ వెళ్లబోతున్నారు.అయితే వచ్చేప్పుడు మాత్రం ఆయన అయ్యప్ప మాల లేకుండా రాబోతున్నాడట.మెగా కాంపౌండ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ డల్లాస్ లోని అయ్యప్ప స్వామి గుడిలో మాలను తీసేయబోతున్నాడట.
మాల తీసేసిన తర్వాత చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటారట.అయితే రెగ్యులర్‌గా అయ్యప్ప మాల వేసే రామ్ చరణ్ చాలా అరుదుగా మాత్రమే కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి వారి దర్శనానికి వెళ్తారు.
సాధారణంగా అయ్యప్ప భక్తులు ఎక్కువ శాతం మంది శబరిమల వెళ్లి మాల విసర్జన చేస్తారు.కానీ చరణ్ తో పాటు కొందరు సెలబ్రిటీలు మాత్రం తమకు వీలున్న చోట మాల విసర్జన చేయడం మనం చూస్తూ ఉంటాం.
ఈసారి రామ్ చరణ్ అయ్యప్ప మాల విసర్జన డల్లాస్ లోని దేవాలయంలో చేయబోతున్నారట.అయితే ఈ తరం వారు అయ్యప్ప స్వామి మాల ధరించడం అది కూడా ఒక స్టార్ సెలబ్రిటీ అయ్యి ఉండి ఎన్నో పనులు ఉంటాయి, వాటన్నింటిని మేనేజ్ చేస్తూ మాలలో కొనసాగడం అనేది మామూలు విషయం కాదని చెప్పాలి.