బిగ్ బాస్ సీజన్8 అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణాలివేనా.. తెర వెనుక ఇంత జరిగిందా?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 8( Bigg Boss 8 ) తాజాగా ముగిసిన విషయం తెలిసిందే.చూస్తుండగానే బిగ్ బాస్ షో ఈసారి అంత తొందరగా గడిచిపోయిందా అనిపిస్తోంది.

 Reasons Behind Bigg Boss Telugu Season 8 Failure Details, Bigg Boss Telugu 8, To-TeluguStop.com

దాదాపు 3 నెలల పాటు ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేసిన బిగ్ బాస్ షో నిన్నటితో పూర్తి చేసుకుంది.దాదాపుగా 22 మంది కంటెస్టెంట్లతో కొనసాగిన ఈ షోలో మొదటి కొంతమంది కంటెస్టెంట్లు రాగా తర్వాత మరి కొంతమంది వైల్డ్ కార్డు( Wild Card ) ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇకపోతే తెలుగులో ఇప్పటివరకు దాదాపు 8 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోగా ఈ ఎనిమిది సీజన్ ల నుండి ఒకటే ప్యాట్రన్ ఫాలో అవుతున్నారు.సేమ్ గెస్ట్ లు రావడం, హరీబరీగా ఫినిష్ చేయడం, కప్ ఇచ్చేయడం హోస్ట్ జర్నీ వీడియో చూపించడం కామన్ గా మారింది.

Telugu Avinash, Bb Akhil, Bigg Boss Show, Biggboss, Gautam, Nagarjuna, Tollywood

అయితే రెగ్యులర్ గా చూడటం డిస్సపాయింట్ గా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్.ఎంతలా అంటే చాలా మంది అట్టర్ ఫ్లాప్ అంటున్నారు.దీనికి ప్రధాన కారణం విన్ అయ్యాక ఎమోషన్స్ సరిగ్గా లేవని, ఎక్స్ కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయిన వాటిని కూడా వన్ మినిట్ కూడా చూపించలేదు.ఎందుకంటే అక్కడ టైమ్ లేదు.

చాలా మంది సెలెబ్రిటీలు( Celebrities ) రావడం.వారి గురించి మాట్లాడం సినిమా ప్రమోషన్స్.

‌ ఇలా అన్నీ ప్రమోషనల్ కోసం గ్రాంఢ్ ఫినాలే ఏర్పాటు చేశారా అన్నట్టుగా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.నిన్న అఖిల్( Akhil ) విన్నర్ అయినప్పటికీ ఏమంత హంగామా కనిపించలేదు.

ఒకవేళ గౌతం విన్నర్ అయి ఉంటే హంగామా నెక్స్ట్ లెవెల్ ఉండేదేమో అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Avinash, Bb Akhil, Bigg Boss Show, Biggboss, Gautam, Nagarjuna, Tollywood

గత ఎనిమిది సీజన్ల నుండి రెగ్యులర్ గా సాగడం మరింత బోరింగ్ గా అనిపించింది.ముఖ్యంగా నిఖిల్ కి సరైన విన్నింగ్ స్పీచ్ రాలేదని, గౌతమ్ కి( Gautam ) సరిగ్గా రెండు నిమిషాలు కూడా మాట్లాడటానికి టైమ్ ఇవ్వకపోవడంతో తెలుగు ఆడియన్స్ చాలా ఫీల్ అవుతున్నారు.కొంతమంది సెలెబ్రిటీలు స్టేజ్ మీదకి వచ్చినా వారిది ఫైనల్ ఎపిసోడ్ లో తీసేసినట్టుగా తెలుస్తోంది.

ఈ సీజన్ 8 లో పెద్ద మైనస్ ఏంటంటే.కన్నడ బ్యాచ్ వర్సెస్ తెలుగు ఫ్యాన్స్ ఓటింగ్ లో పోటీపడటం.

దీనివల్ల జెన్యున్ గా ఆడే కంటెస్టెంట్స్ కి అన్యాయం జరిగింది.హౌస్ లో ఫుల్ ఎంటర్‌టైన్ చేసిన అవినాష్ ప్రతీ గేమ్ లో గెలిచాడు కానీ గౌతమ్ ఇండివిడ్యువల్ గా ఆడుతున్నానంటూ ఎక్కువ గొడవలు పెట్టుకోవడం, అతడికి స్క్రీన్ స్పేస్ ఎక్కువవడంతో అవినాష్ కి( Avinash ) ఓటింగ్ లేకుండా పోయింది.

గ్రాంఢ్ ఫినాలే గ్రాంఢ్ గా లేకపోవడం ఒక స్పార్క్ లేకపోవడంతో ఈ సీజన్ 8 అట్టర్ ఫ్లాఫ్ గా నిలిచింది‌.దానికి తోడు పోలీసుల వార్నింగ్ కారణంగా పెద్దగా సెలబ్రేషన్స్ కూడా లేకపోవడంతో ఈసారి బిగ్ బాస్ షో మొత్తం చప్ప చప్పగా సాగిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube