టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.మంచు ఫ్యామిలీ హీరోలు( Manchu Family Heroes ) నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
అయితే ఇటీవల పలు వివాదాల ద్వారా మంచు కుటుంబం వార్తల్లో నిలిచింది.ఈ నెల 14వ తేదీన మోహన్ బాబు( Mohan Babu ) భార్య, మనోజ్ తల్లి నిర్మల ( Nirmala
)పుట్టినరోజు వేడుకలను ఆమె కుటుంబ సభ్యులు నిర్వహించడం జరిగింది.
అయితే ఈ కార్యక్రమం నిర్వహించే సమయంలో జనరేటర్ లో చక్కెర వేసి కరెంట్ లేకుండా చేయడం ద్వారా చంపటానికి ప్రయత్నించారని మనోజ్( Manoj ) తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే మనోజ్ ఫిర్యాదులో నిజం లేదని నిర్మల వెల్లడించడం కొసమెరుపు.
జల్ పల్లిలోని ఇంటికి విష్ణు కేక్ తీసుకోని వచ్చాడని ఆమె అన్నారు.పుట్టినరోజు వేడుకలను అందరూ కలిసి జరుపుకున్నామని ఆమె వెల్లడించారు.

విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని మనోజ్ చేసిన ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని నిర్మల కామెంట్లు చేశారు.కేక్ కట్ చేసిన తర్వాత విష్ణు తన గదిలో ఉన్న సామాన్లను తీసుకొని వెళ్లాడని ఆమె చెప్పుకొచ్చారు.ఇంట్లో ఇద్దరు కొడుకులకు సమానంగా హక్కులు ఉన్నాయని నిర్మల వెల్లడించడం గమనార్హం.ఇంట్లో పనిమనుషులు పని మానేయడానికి విష్ణు కారణం కాదని ఆమె తెలిపారు.

నిర్మల రాసిన లేఖ విషయంలో మనోజ్ రియాక్షన్ ఎలా ఉంటాడో చూడాలి.ఈ వివాదం విషయంలో మనోజ్ ఒంటరివాడు అవుతున్నాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జనసేనలో మనోజ్ దంపతులు చేరతారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.మనోజ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.
మంచు మనోజ్ వివాదాలకు దూరంగా ఉండాలని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.