ఐకాన్ స్టార్, నేషనల్ అవార్డు విజేత అల్లు అర్జున్(Iconic star and National Award winner Allu Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న ఈ యాక్షన్ హీరో పలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.
‘పుష్ప: ది రైజ్’(‘Pushpa: The Rise’) చిత్రంతో నేషనల్ అవార్డు గెలుచుకున్న బన్నీ.ఇప్పుడు ‘పుష్ప 2: ది రూల్’(‘Pushpa 2: The Rule)తో మరోసారి ఇండియా వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు.
ఇకపోతే… అల్లు అర్జున్(Allu Arjun) తన 43వ పుట్టిన రోజు (ఏప్రిల్ 8)ను నేడు ఘనంగా జరుపుకుంటున్నాడు.ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.
సినీ ప్రముఖులు, కోలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా బన్నీకి విషెస్ చెబుతున్నారు.తాజాగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి(Allu Arjun’s wife Sneha Reddy), పుట్టినరోజు వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఫ్యామిలీతో కలిసి బన్నీ కేక్ కట్ చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.వీటిని చూసిన అభిమానులు ఆయనకు పెద్దేత్తున్న పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అల్లు అర్జున్ కెరీర్ పరంగా చూస్తే, ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెడుతున్నట్టు సమాచారం.తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడని టాలీవుడ్ వర్గాల టాక్.ఈ సినిమాను సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మించనున్నారు.ఈ హై వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన బన్నీ పుట్టినరోజు రోజే రావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి పుట్టినరోజు వేడుకలు, కుటుంబంతో గడిపిన ఆనంద క్షణాలు, అభిమానుల ప్రేమ, వరుసగా వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ అల్లూ అర్జున్‌కు ఈ బర్త్‌డేను మరింత స్పెషల్‌గా మార్చేశాయి.