వేసవి కాలంలో చాలా మంది ఫ్రిడ్జ్ నీరు ( Fridge Water )తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు.ఎండాకాలంలోని వేడికి బిందెలో ఉన్న నీరు తాగితే దాహం తీరినట్టు అనిపించదు.
కాబట్టి అందరూ ఫ్రీజ్ వాటర్ తాగుతూ ఉంటారు.దీని వల్ల తాత్కాలిక ఉపశమనాన్ని పొందుతారు.
కొందరైతే అసలు కూల్ వాటర్ తాగకుండా ఉండలేరు.బయటకు వెళ్లినా సరే ఒక బాటిల్ పట్టుకొని వెళ్తూ ఉంటారు.
అంతే కాకుండా పలు రకాల పండ్ల రసాలు కూడా చల్లచల్లగా తాగుతూ ఉంటారు.అయితే చల్లటి నీరు వడదెబ్బ తగలకుండా కాపాడినప్పటికీ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఫ్రిడ్జ్ వాటర్ రోగ నిరోధక శక్తి( Immunity )ని తగ్గించడంతో పాటు మలబద్దకం, గ్యాస్ లాంటి సమస్యలు వచ్చేలా చేస్తుంది.ముఖ్యంగా కూల్ వాటర్ లో గుండెలోని వాగస్ నరాల పై ప్రభావం చూపి గుండె పోటుకు దారి తీస్తుంది.అంతే కాకుండా తలనొప్పి, సైనస్ ప్రాబ్లమ్స్ వంటివి తీవ్రతరం అవుతాయి.అయితే కొంతమంది ఏదైనా ఆహారం తినగానే,అలాగే బయటకు వెళ్లి రాగానే చల్లటి నీరు తాగుతూ ఉంటారు.
అలా చేయడం మంచిది కాదు.నాడీ వ్యవస్థ చల్లబడి పల్స్ రేట్, హార్ట్ బీట్ పెరిగి హార్ట్ ఎటాక్ ( Heart attack )వస్తుంది.
కాబట్టి ఈ కూల్ వాటర్ కాకుండా మట్టి కుండలోని నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

అలాగే చల్లటి నీరు శరీరంలో ను కొవ్వును పెంచుతుంది.దీంతో బరువు తగ్గాలనుకునే వారు మరింత బరువు పెరిగే అవకాశం ఉంది.కాబట్టి అధిక బరువు ఉన్నవారు చల్లటి నీటికి దూరంగా ఉండడం మంచిది.
వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు చల్లటి నీరు బెస్ట్ అని కొంతమంది తెగ తాగుతూ ఉంటారు.కానీ వాటి వల్ల జలుబు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు వస్తాయి.
దీంతో ఆహారాన్ని తినలే.రు సరిగా మాట్లాడలేకపోతారు.
కాబట్టి ఇలాంటివారు సాధారణ కుండ నీరు తీసుకోవడం మంచిది.