ఏకాదశి తర్వాతి రోజు వచ్చే వాసుదేవ ద్వాదశి ప్రత్యేకత ఇదే..!

వాసుదేవ ద్వాదశి రోజు( Vasudeva Dwadashi ) కృష్ణుడికి సంబంధించినది.దీనిని తొలి ఏకాదశి తర్వాతి రోజు జరుపుకుంటారు.

 This Is The Special Feature Of Vasudeva Dwadashi Which Comes On The Day After Ek-TeluguStop.com

చాతుర్మాస్య వ్రతాన్ని తొలి ఏకాదశి రోజు మొదలు పెట్టాలని కొన్ని పురాణాలు చెబుతూ ఉంటే, వాసుదేవ ద్వాదశి నుంచి ప్రారంభించాలని మరికొన్ని పురాణాలు చెబుతున్నాయి.ఏకాదశి రోజు శ్రీకృష్ణుని సోదరి సుభద్రా వ్రతం పెట్టకపోవడంతో ద్వాదశి రోజు ఆమెకు కృష్ణుడు( Krishna ) గోపద్మ వ్రతాన్ని ఉపదేశించి ఐదేళ్ల వ్రతాన్ని ఒకేసారి పూర్తి చేయించాడని పెద్దవారు చెబుతూ ఉంటారు.

అందుకే వాసుదేవ ద్వాదశిగా ప్రసిద్ధి చెందిందని పండితులు చెబుతున్నారు.

Telugu Bakthi, Bhakti, Devotional, Ekadashi, Krishna, Lord Vishnu-Telugu Health

ముఖ్యంగా చెప్పాలంటే వాసుదేవుడు అంటే శ్రీ మహా విష్ణువే అని పెద్దవారు చెబుతూ ఉంటారు.శ్రీమహావిష్ణువు( Lord Vishnu ) నామాల్లో ఒక్కొక్క దానికి ఒక్కో విశిష్టత ఉంది.అలాగే వాసుదేవ నామానికి ఎంతో ప్రత్యేకత ఉంది.

వాసుదేవుని కుమారుడైనందున వాసుదేవా అనే పేరు వచ్చింది.అన్నిటిలో వసించు వాడు కానుక వాసుదేవుడు అని అంటారు.

ఇంకా చెప్పాలంటే అన్ని ప్రాణుల్లో నివసించే ప్రాణశక్తి, చైతన్య శక్తి, ఆత్మ పరమైన శక్తికి వాసుదేవమనే పేరు ఉన్నట్లు పెద్దవారు చెబుతూ ఉంటారు.అలాగే ప్రాణులను ఆశ్రయించి ఉండే వైశ్వానరాగ్నికి వాసుదేవమనే పేరు ఉంది.

Telugu Bakthi, Bhakti, Devotional, Ekadashi, Krishna, Lord Vishnu-Telugu Health

వాసుదేవ ద్వాదశి రోజు ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ రోజు చేసే కార్యక్రమాల విషయానికి వస్తే శయనేకాదశి రోజు ఉపవాసం ఉన్న వారు ద్వాదశి రోజు శ్రీ మహా విష్ణువుని పూజించి భోజనం చేయాలి.ద్వాదశి పుణ్యా తిధి శ్రీ మహా విష్ణువుకి ఎంతో ఇష్టమైనది.శయన ఏకాదశి తర్వాత వచ్చేది కాబట్టి దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.వాసుదేవా ద్వాదశి రోజు ప్రత్యేకంగా ఆచరించవలసిన విధానాల గురించి పురాణాలలో ఎక్కడా ప్రత్యేకంగా చెప్పలేదు.ఈ రోజు ప్రత్యేకంగా ఉపవాసము చేయవలసిన అవసరం లేదు.

ఏకాదశి గోపద్మ చతుర్మాస్య వ్రతాలు చేసేవారు ఆయా వ్రత నియమాలను అనుసరించాలి.వాసుదేవా ద్వాదశి అని ప్రత్యేకంగా పేర్కొంటున్నాం కాబట్టి విష్ణు సహస్రనామం పాటించడం, గోపద్మ వ్రత కథను చదవడం ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube