కూల్ డ్రింక్స్ లో ఉపయోగించే ఈ కృతిమ తీపి తో క్యాన్సర్ ముప్పు..WHO హెచ్చరిక జారీ..!

కూల్ డ్రింక్స్ తాగే వారికి డబ్ల్యూహెచ్ఓ( WHO ) ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది.ముఖ్యంగా చెప్పాలంటే శీతల పానీయాలలో వినియోగించే కృతిమ తీపి క్యాన్సర్ కు కారణం అవుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

 కూల్ డ్రింక్స్ లో ఉపయోగించే ఈ-TeluguStop.com

అస్పర్టెమ్‌ అనే నాన్-షుగర్ స్వీటెనర్ అందుకు ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనాలలో తెలిసింది.అస్పర్టమే అనే కృతిమ తీపిని ప్రపంచంలో అన్ని దేశాల్లో శీతల పానీయాలలో( soft drinks ) వినియోగిస్తున్నారు.

ఇది తక్కువ క్యాలరీలు ఉండే కృతిమ స్వీటెనర్ అని నిపుణులు చెబుతున్నారు.

Telugu Asicacid, Tips, Soft Drinks, Sucrose-Telugu Health Tips

ఇది సుక్రోజ్( Sucrose ) కంటే సుమారు 200 రెట్లు తియ్యగా ఉంటుంది.దీని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ జూలై నెలలో ప్రకటించబోతున్నట్లు సమాచారం.కొక-కోలా, డైట్ సోడాలు, మార్స్ ఎక్స్‌ట్రా చూయింగ్ గమ్ కొన్ని రకాల స్నాపిల్ డ్రింక్స్ వంటి పలు ఉత్పత్తులలో అస్పర్టమే వినియోగిస్తూ ఉన్నారు.

అస్పార్టిక్ యాసిడ్ ఫెనిలాలనైన్( Aspartic acid is phenylalanine ) అనే రెండు అమైనో ఆమ్లాలతో ఈ స్వీట్నర్ ను తయారు చేస్తారు.అస్పార్టిక్ ఆమ్లం, ఫెనిలాలనైన్‌తో పాటు అందులో కొద్ది మొత్తంలో మిధనాల్ కూడా ఉంటుంది.

Telugu Asicacid, Tips, Soft Drinks, Sucrose-Telugu Health Tips

1965లో రసానిక శాస్త్రవేత్త జేమ్స్ ఎం ష్లాటర్ అస్పర్టెమ్‌ ను కనుగొన్నారు.ఇంకా చెప్పాలంటే కార్పోనేటెడ్ పానియాల్లో తీపి రుచికి ప్రత్యామ్నాయంగా అస్పర్టెమ్‌ను ఉపయోగించటానికి యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 1983లో ఆమోదించింది.ఇంకా చెప్పాలంటే కూల్ డ్రింక్స్ లో మాత్రమే కాకుండా తృణధాన్యాలు, చక్కెర లేని చూయింగ్, తక్కువ క్యాలరీల పండ్ల రసాలు, డైట్ సోడాలతో సహా చాలా రకాల ఆహారాలు, పానీయాలలో చక్కెరకు ప్రయత్నమాయంగా అస్పర్టమేని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు.అందువల్ల కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగే వారిలో క్యాన్సర్ ముప్పు అధికంగా ఉందని డబ్ల్యూహెచ్ఓ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube