ఇండస్ట్రీకి చాల మంది కమెడియన్స్ వస్తుంటారు.కానీ అందులో కొందరికి మాత్రమే మంచి పేరు, గుర్తింపు వస్తుంది.
అలాంటి కమెడియన్స్ లో ఒక్కరు సుత్తివేలు.ఆయన తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.
అయితే మనిషి జీవితంలో ఒడిదిడుకులు రావడం సహజం.ఇక ఒకప్పుడు బాగా బతికి , ఇప్పుడు చితికిపోయారనే మాట ఇండస్ట్రీలో చాలామంది విషయంలో కనిపిస్తూ ఉంటుంది.
ఇక జంధ్యాల ఎంకరేజ్ మెంట్ తో హాస్య నటుడిగా రాణించిన సుత్తివేలు జీవితంలో ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నారో చూద్దామా.
హాస్యనటుడు సుత్తివేలు ఇండస్ట్రీలో తనదైన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు.
కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ప్రేక్షకుల మదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతేకాదు సత్యవేలు సీరియల్ పాత్రల్లో సైతం రాణించారు.
ఇక సుత్తివేలు తండ్రి శేష సత్యనారాయణ శర్మ, తాతయ్య పేరు లక్ష్మి నరసింహారావు.తాతయ్య పేరే సుత్తివేలుకి పెట్టారు.
తాతగారికి ఆస్తులుండేవి.ఎలాంటి బాధ లేకుండా హాయిగా ఉండేవారు.
మంచితనమే,సాయం చేసే గుణమో మొత్తానికి ఆస్తులు కరిగిపోతూ వచ్చాయి.
ఇక సుత్తివేలు తండ్రి హయాంలో కూడా బాగానే ఉండేదట.
టీచర్ గా ఉద్యోగం సంపాదిస్తే, ఆరు నెలలకు ఒకేసారి జీతాలు రావడం,ఇంట్లో అనారోగ్యాలు వంటి వాటివలన సత్యనారాయణ శర్మ బతికి చెడ్డాడనే పేరు తెచ్చుకున్నారు.తండ్రి దానగుణం వలన కూడా మరిన్ని ఆస్తులు కరిగి, కొద్దిపాటి ఆస్తులే మిగలడంతో కొన్నాళ్ళు సుత్తివేలు సజావుగానే జీవించారు.
తండ్రిలాగానే నాటకరంగం మీద మక్కువతో ఆంధ్ర,తమిళనాడులలో నాటకాలు వేస్తూ బిజీగా గడిపారు.
ఆయన రెమ్యునరేషన్ విషయంలో రాజీపడకుండా కుటుంబాన్ని పోషిస్తూ వచ్చారు.నాలుగు స్తంభాలాట మూవీతో ఎంట్రీ ఇచ్చి, ఖైదీ, రెండు జెళ్ళ సీత, ఇలా పలు చిత్రాల్లో దశాబ్దకాలం పాటు ఇండస్ట్రీని దున్నేసాడు.పక్కా ప్లాన్ చేసుకోవడం వలన ఉన్నన్నాళ్ళు హాయిగా కాలం గడిపారు.
సరదాగా నవ్విస్తూ నవ్వుతూ జీవించారు.