హీరోగానే ఉండిపోవాలని శోభన్ బాబు రిజెక్ట్ చేసిన రోల్స్ ఇవే.. ఇంత మంచి పాత్రలు వదులుకున్నారా?

తెలుగు సినిమా ప్రేక్షకులకు సోగ్గాడు అందగాడు అయినా నటుడు శోభన్ బాబు( Actor Shobhan Babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఆయన పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన అందం.

 Remembering Sobhan Babu On His Birth Anniversary He Rejects These Movies, Sobhan-TeluguStop.com

ఒకప్పుడు తన అందంతో సినిమా ఇండస్ట్రీలో ఒక రాజ్యం ఏలారు.ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు.

ఇక అందంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి.ఇప్పటికీ అభిమానుల మనసులలో చెరగని ముద్రను వేసుకున్నారు.

ఇది ఇలా ఉంటే నేడు ఆయన 88వ జయంతి.ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే శోభన్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చిన మంచి మంచి అవకాశాలను రిజెక్ట్ చేశారట.

Telugu Anniversary, Reject, Sobhanbabu, Sobhan Babu, Tollywood-Movie

ఇంతకీ ఆయన రిజెక్ట్ చేసిన ఆ అవకాశాలు ఏవి? ఎందుకు రిజెక్ట్ చేశారు అన్న వివరాల్లోకి వెళితే.విజయవాడ సమీపం లోని చిన్ననందిగంలో రైతు కుటుంబంలో పుట్టారు శోభన్‌ బాబు.అసలు పేరు శోభనా చలపతిరావు.

( Shobhana Chalapathy Rao ) హైస్కూల్‌ రోజుల్లో పాతాళభైరవి, దేవదాసు, మల్లీశ్వరి ఎక్కువగా చూసేవారు.తాను ఇండస్ట్రీలోకి రావడానికి ఒక రకంగా ఆ చిత్రాలే కారణమని ఒక సందర్భంలో చెప్పారు ఆయన.ఆ తరువాత సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ హీరోగానే ఉండాలనేది ఆయన ఆకాంక్ష.

అందుకే సినీ రంగంలో ప్రవేశం కంటే నిష్క్రమణ ముఖ్యమని అంటుండేవారు.పాత్రకు మించిన వయసుతో హీరోగా చేయడం ఇష్టంలేని ఆయన నట జీవితానికి వీడ్కోలు పలికారు.

Telugu Anniversary, Reject, Sobhanbabu, Sobhan Babu, Tollywood-Movie

పిల్లలనూ సినిమాలకు దూరంగా పెంచారు.నాగార్జున ( Nagarjuna )ప్రధాన పాత్రలో రాఘవేంద్రరావు తెరకెక్కించిన అన్నమయ్య, ఇందులో వేంకటేశ్వరస్వామి పాత్రను పోషించమని చిత్ర బృందం కోరగా సున్నితంగా తిరస్కరించారట.అలాగే మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన చిత్రం అతడు.ఈ సినిమాలోని సత్యనారాయణ మూర్తి పాత్ర ముందుగా శోభన్‌ బాబు దగ్గరకే వెళ్లిందట.నటుడు, నిర్మాత మురళీ మోహన్‌ ఈ పాత్ర చేయమని బ్లాంక్‌ చెక్కు ఇచ్చినా శోభన్‌ బాబు నో చెప్పారట.ఇక పవన్‌ కల్యాణ్‌ హీరోగా భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించిన సుస్వాగతం సినిమాలో రఘువరన్‌ పోషించిన పాత్ర కోసం ముందుగా శోభన్‌ బాబును సంప్రదించారట.

హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్ర పోషించిన బ్లాక్‌ చిత్రాన్ని తెలుగులో శోభన్‌ బాబుతో రీమేక్‌ చేయాలనుకున్నారు నిర్మాత ఆర్.బి.చౌదరి.దానికీ నో చెప్పారట.

ఈ విధంగా ఆయన తిరస్కరించిన సినిమాలు విడుదల అయ్యి మంచి మంచి హిట్లను సాధించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube