ఎంబీబీఎస్ అడ్మిషన్లు.. చెన్నైలో వెలుగు చూసిన నకిలీ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్లు

దేశంలోని మెడికల్ కాలేజీలలో ఎన్ఆర్ఐ విద్యార్ధుల కోటా( NRI Students Quota ) వ్యవహారం గతేడాది దుమారం రేపిన సంగతి తెలిసిందే.స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం ఈ విధానం పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

 Chennai Police Conducting Raids In Education Counselling Centres In Connection W-TeluguStop.com

ఇది పూర్తిగా మోసమని, ప్రతిభావంతులను కాదని, దొడ్డిదారిన వచ్చే వారికి ప్రవేశాలు కల్పించడానికి ఇది అవకాశం కల్పిస్తోందని మండిపడింది.

తాజాగా అండర్ గ్రాడ్యుయేట్ / పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ఎన్ఆర్ఐ విద్యార్ధులమంటూ నకిలీ సర్టిఫికెట్లు( Fake Certificates ) సమర్పించిన వ్యవహారం దుమారం రేపుతోంది.

ఈ కేసుకు సంబంధించి గ్రేటర్ చెన్నై పోలీస్( Greater Chennai Police ) విభాగంలోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ .ఎడ్యుకేషన్ కౌన్సెలింగ్ కేంద్రాలలో సోదాలు నిర్వహించింది.2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎన్ఆర్ఐ కోటా కింద మెడికల్ కోర్సుల్లో( Medical Courses ) యూజీ, పీజీ ప్రవేశానికి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆన్‌లైన్ ద్వారా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ నిర్వహించింది.

Telugu Chennai, Greater Chennai, Medical Scam, Medical Courses, Nri Quota-Telugu

ఈ సమయంలో కొందరు విద్యార్ధులు పలు దేశాల్లోని భారత రాయబార కార్యాలయం చేసినట్లుగా నకిలీ ఎన్ఆర్ఐ బోనఫైడ్ సర్టిఫికేట్‌లను సమర్పించినట్లు కనుగొనబడింది.సదరు డైరెక్టరేట్ దాఖలు చేసిన ఫిర్యాదుపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లోని ఫోర్జరీ ఇన్వెస్టిగేషన్ వింగ్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Telugu Chennai, Greater Chennai, Medical Scam, Medical Courses, Nri Quota-Telugu

చెన్నైలో పనిచేస్తున్న కొన్ని విద్యా కౌన్సెలింగ్ కేంద్రాల నుంచి విద్యార్ధులు ఎన్ఆర్ఐ కోటా కింద ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నట్లుగా దర్యాప్తులో తేలింది.శ్రీసాయి ఎడ్యుకేషనల్ అకాడమీ, పల్లవరం.మెటా నీట్, పోరూర్.శ్రీ సాయి కెరీర్ నెక్స్ట్ అకాడమీ, సాలిగ్రామం.శ్రీ సాయి కెరీర్ నెక్స్ట్ అకాడమీ, నుంగంబాక్కం.జియాన్ కెరీర్ సొల్యూషన్స్, వెలాచ్చేరి.లైఫ్ లింక్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, అన్నానగర్.

లలో ఈ సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.ఈ సోదాల్లో కేసుకు సంబంధించి 105 నేరారోపణ పత్రాలు, 19 సీళ్లు, 22 కంప్యూటర్లు, రెండు పెన్ డ్రైవ్‌లు, ఐదు హర్డ్ డిస్క్‌లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ పత్రాల ఆధారంగా దర్యాప్తులో ముందుకు వెళ్తామని పోలీసులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube