మన జుట్టుకు కావలసిన ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్ ముందు వరుసలో ఉంటుంది.సరైన ప్రోటీన్ అందకపోతే జుట్టు విపరీతంగా రాలడం, విరగడం, చిట్లడం, హెయిర్ గ్రోత్ లేకపోవడం తదితర సమస్యలు తలెత్తుతుంటాయి.
అందుకే జుట్టుకు ప్రోటీన్ అందించడం మన బాధ్యత.అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ రెమెడీని పాటిస్తే మీ జుట్టుకు మంచి ప్రోటీన్ అందటమే కాదు కురులు ఒత్తుగా సైతం పెరుగుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం చేసి స్త్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు మెంతుల పొడి( Fenugreek )ని వేసుకోవాలి.
అలాగే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు కొబ్బరి పాలు( Coconut Milk ), వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి.

చివరిగా ఈ మిశ్రమంలో ఒక ఎగ్ ను బ్రేక్ చేసి వేసి మరోసారి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మీ రెగ్యులర్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే జుట్టుకు చక్కటి ప్రోటీన్ అందుతుంది.ఫలితంగా కుదుళ్ళు బలోపేతం అవుతాయి. జుట్టు రాలడం( Hair fall ) క్రమంగా తగ్గుతుంది.

కురులు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతాయి.అలాగే ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల చిట్లిన జుట్టు రిపేర్ అవుతుంది.మెంతుల పొడి మరియు ఆముదం లో ఉండే ప్రత్యేక సుగుణాలు చుండ్రు సమస్యను నివారిస్తాయి.
జుట్టు బ్రేక్ అవడం కూడా తగ్గుతుంది.కాబట్టి ఆరోగ్యమైన మరియు ఒత్తయిన జుట్టును కావాలని కోరుకునేవారు తప్పకుండా పైన చెప్పిన మ్యాజికల్ హోమ్ రెమెడీని పాటించండి.







