రూపాయి ఖర్చు లేకుండా పిల్లలను రోలర్ కోస్టర్( roller coaster ) ఎక్కించడమా? అదెలాగండీ, మార్కెట్లో టికెట్ మినిమం వంద రూపాయిలు ఉంటుంది అని అంటారా? ఐతే మీరు ఈ కధనం పూర్తిగా చదవాల్సిందే.పిల్లల ఆనందానికి మించి తల్లిదండ్రులకు ఏం కావాలి చెప్పండి? పిల్లలు అడగాలే కానీ తల్లిదండ్రులకు కొండమీది కోతినైనా తీసుకు రావడానికి సిద్ధపడతారు.అలాంటిది తొక్కలో రోలర్ కోస్టర్ ఎక్కించరా అనే అనుమానం కలగక మానదు.అయితే రోలర్ కోస్టర్ అందరికీ అందుబాటులో ఉండదు.

పల్లెల్లో వున్నవారికి అయితే యేవో జాతర్లలో తప్పితే సాధారణంగా రోలర్ కోస్టర్ వంటివి వారికి అందుబాటులో ఉండదు.అలాంటివారికి తమ పిల్లల్ని రోలర్ కోస్టర్ ఎక్కించడం అనేది ఓ కలలాగే ఉంటుంది.అయితే ఆలోచన వుండాలేగాని రోలర్ కోస్టర్ ఎక్కించడం ఎంతపని అని కొందరు ఔత్సాహికులు నిరూపిస్తున్నారు.అది విషయం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోని చూస్తే అర్ధం అయిపోతుంది.

ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ వీడియోను చూస్తే… అరెరే ఇలాంటి ఐడియా మాకు రాలేదేమిటి అనుకుంటారు.ఇక్కడ వైరల్ వీడియోలో దంపతులు తమ ఇంట్లో ఉన్న పెద్ద ఎల్‌ఈడీ టీవీతో ‘రోలర్ కోస్టర్ రైడ్’( Roller Coaster Ride )ను ఇంట్లోకి తీసుకువచ్చారు.అవును, అదెలాగో వీడియో చూస్తే మీరు అర్ధం అయిపోతుంది.సాఫ్ట్ కుషన్‌తో కూడిన టబ్‌లో పాపను మొదట కూర్చోబెట్టి, చెరో పక్క పట్టుకొని టీవీ దగ్గరకు తీసుకువెళ్లారు.
టీవీలో రోలర్ కోస్టర్ వర్చువల్ వీడియోను ప్లే చేశారు.అంతే, పాప ఆ రైడ్‌లో భాగం అయింది.నిజంగా రోలర్ కోస్టర్ పైన పయనిస్తున్నట్టు పాప ఫీల్ అవ్వడం ఇక్కడ చూడవచ్చు.పైగా పైసా ఖర్చు లేదు!
.






