జయసుధ… తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు సౌత్ ఇండియాలోనే నాచురల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకొని తనదైన గుర్తింపుతో కొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో ఏకచత్రాధిపత్యం చేసింది.ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తల్లి, బామ్మ పాత్రలు చేస్తూ కెరియర్ ను కొనసాగిస్తోంది.
ఇక జయసుధ జీవితంలో అనేక విచిత్రమైన సంఘటనలు ఉన్నాయట.మరీ ముఖ్యంగా జయసుధకు అసలు సినిమాలంటే ఏమాత్రం ఇష్టం లేదట.
మరి ఈ సినిమాలంటే అంత యావగింపు ఉన్న జయసుధ ఎలా నాచురల్ హీరోయిన్ గా ఎదిగింది ? ఎలా నిర్మాతగా, దర్శకురాలిగా మారింది ? అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎలా ప్రవేశించింది.అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జయసుధ తల్లి పేరు జోగాబాయ్ ఆమె సినిమాలో నటించేది.సినిమాలంటే ఆమెకు ఎంతో ఇష్టం.చేసిన తండ్రి పేరు రమేష్.వీరి కూతురైన సుజాత అలియాస్ జయసుధకు ఏమాత్రం ఇష్టం లేదు.సినిమాలు నటించడం అంటే కాదు ఏకంగా చూడడానికి కూడా ఇష్టపడేది కాదట.అలాంటి జయసుధ నుంచి ఆమె సినిమా ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది, ఇంతమంది అభిమానులను ఎలా సొంతం చేసుకోగలిగింది అనే విషయాల గురించి కృష్ణ భార్య మరియు ప్రముఖ హీరోయిన్ ఆయన విజయనిర్మల తన పుస్తకంలో ఏకంగా నాలుగు పేజీల విషయాలను పంచుకున్నారు.
జయసుధకు చిన్నతనంలో తన తండ్రి రమేష్ జాతకాన్ని రాయించారట.అందులో జయసుధ గొప్ప నటి అవుతుందని, ఎంతో స్టార్ డం చూస్తుందని, బోలెడంత పేరు అంతకుమించిన డబ్బు కూడా సొంతం చేసుకుంటుంది అని చెప్పారట జయసుధ కు జాతకం రాయించిన జ్యోతిష్యులు.కానీ ఓవైపు మూడు గంటల పాటు గదులు మూసి మరీ బంధించి సినిమా చూపించడం అనే కాన్సెప్ట్ అంటేనే ఏ మాత్రం ఇష్టం లేని జయసుధ విజయనిర్మల వల్ల పండంటి కాపురం సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఆ తర్వాత అంచలంచలుగా ఏదిగి స్టార్ హీరోయిన్ గా అవతరించింది.
అలా తన జాతకం గురించి తెలుసుకొని తనలో తాను ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటుందట.