కలియుగం క్లైమాక్స్ కి చేరిందా.. కళ్ళు తెరిచిన శని దేవుడు.. గుడికి భారీగా వచ్చిన భక్తులు..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మేరేనా లోని అంతి పర్వతంపై శని దేవుడి ప్రసిద్ధ దేవాలయం ఉంది.2022 సంవత్సరం చివరి రోజున డిసెంబర్ 31 సాయంత్రం నాలుగు గంటలకు ఒక భక్తుడు ఈ దేవాలయంలోని గర్భగుడి వెలుపల చేసిన వీడియో వల్ల ఈ విషయం ప్రపంచానికి తెలిసింది.దీనికి కారణం ఏమిటంటే వాస్తవానికి దేవాలయంలో ఉన్న శని దేవుడి విగ్రహం కళ్ళు మూసుకొని ఉంటుంది.కానీ ఈ వీడియో సమయంలో శని దేవుడు కళ్ళు తెరిచి కనిపించడంతో ఈ దేవాలయానికి భక్తుల రద్దీ పెరిగిపోయింది.

 Shani Dev Statue Eyes Opened In Madhya Pradesh Morena Details, Shani Dev, Shani-TeluguStop.com

మెరీనాలోని ఈ శని దేవాలయానికి ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు.శని అమావాస్య రోజు సుమారు రెండు లక్షల మంది భక్తులు తమ కోరికలతో ఇక్కడ ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు.

శని దేవుడి విగ్రహం కళ్ళు తెరిచిన ఘటన ఒక అద్భుతమని భక్తులు చెబుతున్నారు.అయితే కొందరు దీనిని సంకేతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

దేవాలయం చుట్టూ జరుగుతున్న చర్చల్లో శని దేవుని అనుగ్రహం అంటూ కొందరు శని భారంగా ఉండొచ్చని మరికొందరు అంటున్నారు.దేవాలయ పూజారి బాబా శివరాం దాస్ త్యాగి మహారాజ్ మాట్లాడుతూ శని దేవుడు కళ్ళు తెరవడం ఒక అద్భుతం అని తెలిపారు.గ్వాలియర్ పోలీస్ లైన్లో పోస్ట్ చేసిన అశోక్ పరిహార్ అనే పోలీస్ ఇక్కడ సందర్శించడానికి వచ్చి ఈ వీడియోను రికార్డ్ చేసినట్లు దేవాలయ అధికారులు చెబుతున్నారు.

డిసెంబర్ 31 సాయంత్రం నాలుగు గంటల సమయంలో తను దేవాలయంలోని దేవుని విగ్రహాన్ని వీడియో తీస్తున్న సమయంలో విగ్రహం కళ్ళు తెరిచి ఉండడం చూసినట్లు పరిహార్ చెబుతున్నాడు.మొబైల్ ను తీసివేసి తర్వాత కూడా శని దేవుడి విగ్రహం కళ్ళు తెరిచినట్లు కనిపించిందని అప్పుడు పరిహార్ ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు.కలియుగం దగ్గర పడిందని కూడా ఈ సందర్భంగా దేవాలయ అధికారులు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube