మనం సాధారణంగా దొండకాయలతో వేపుళ్లు,కూర చేసుకుంటూ ఉంటాం.అయితే దొండకాయను కొంతమంది ఇష్టంగా తింటారు.
కొంతమంది తినటానికి ఇష్టపడరు.దొండకాయలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.
అలాగే దొండ ఆకులో కూడా ఎన్నో అవసరమైన పోషక విలువలు ఉన్నాయి.ఇప్పుడు చెప్పే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే తప్పనిసరిగా దొండకాయ మరియు దొండ ఆకు తినటం మానరు.
తప్పనిసరిగా తింటారు.అయితే దొండ ఆకు వలన కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఆయుర్వేదంలో దొండ ఆకును ఎక్కువగా ఉపయోగిస్తారు.
దొండ ఆకు రసాన్ని 20 గ్రాములు ప్రతి రోజు నెల రోజుల పాటు తీసుకుంటూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది.ఈ దొండ ఆకు రసం మధుమేహ రోగులకు బాగా పనిచేస్తుంది.
దొండ ఆకుల రసంలో వెల్లుల్లి రసం,ఆవాల పొడి వేసి బాగా కలిపి 3 గ్రాముల మోతాదులో ఉండల్లా చేసి మూడు పూటలా ఒక్కో ఉండను నీటితో తీసుకుంటే మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది.
అయితే దొండ ఆకురసం,ఆవాల పొడి,వెల్లుల్లి రసం మూడింటిని సమానమైన మోతాదులో తీసుకోవాలి.
దొండ ఆకులు, నల్ల ఉమ్మెత్త ఆకులు, చిక్కుడు ఆకులను సమానంగా తీసుకుని వాటిని దంచి రసాన్ని తీయాలి.ఈ రసాన్ని అరికాళ్లకు రాస్తే అరికాళ్ళ మంటలు తగ్గిపోతాయి.రోజులో రెండు సార్లు రాస్తే తగ్గిపోతుంది.
50 గ్రాముల గేదె పెరుగులో 20 గ్రాముల దొండ ఆకురసాన్ని కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి.