మధుమేహులకు బెస్ట్ స్మూతీ ఇది.. రోజు ఉదయం తీసుకుంటే బోలెడు లాభాలు!

ఇటీవల కాలంలో మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.ఇంటికి కనీసం ఒక్కరైనా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉంటున్నారు.

 Best Smoothie To Control Sugar Levels In Diabetics , Diabetics, Sugar Levels-TeluguStop.com

అయితే మధుమేహులకు ( Diabetics )రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం పెద్ద సవాలుగా మారుతుంటుంది.దానికి తోడు నీరసం, అలసట వంటివి కూడా చాలా ఇబ్బంది పెడుతుంటాయి.

అయితే వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఇప్పుడు చెప్పబోయే స్మూతీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

Telugu Diabetes, Diabetics, Tips, Latest, Sugarlevels-Telugu Health

ఈ స్మూతీని రోజు ఉదయం తీసుకుంటే బోలెడు లాభాలు పొందుతారు.మరి ఇంతకీ ఆ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా బ్లెండ‌ర్ తీసుకుని అందులో ఒక కప్పు త‌రిగి పెట్టుకున్న ఆపిల్ ముక్కలు ( apple slices )వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్,( Rolled Oats ) వన్ టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజలు, ఒక గ్లాస్ సోయా పాలు, ( Soy milk )హాఫ్ టేబుల్ స్పూన్ మునగాకు పొడి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Diabetes, Diabetics, Tips, Latest, Sugarlevels-Telugu Health

తద్వారా మన డయాబెటిస్ ఫ్రెండ్లీ స్మూతీ సిద్ధం అవుతుంది.ఈ స్మూతీ లో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Spoon chia seeds ) కలిపి రోజు మార్నింగ్ గా తీసుకోవాలి.ఈ స్మూతీ బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.

చ‌క్కెర స్థాయిలో హెచ్చుత‌గ్గులను నిరోధిస్తుంది.అలాగే ఈ స్మూతీని ఉదయం తీసుకుంటే రోజంతా చాలా యాక్టివ్ గా ఉంటారు.

నీరసం అలసట వంటి స‌మ‌స్య‌లు వేధించకుండా ఉంటాయి.అంతే కాదు ఈ స్మూతీ వల్ల పీసీఓడీ మరియు పిసిఒఎస్ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన ఫీలింగ్ క‌లుగుతుంది. వెయిట్ లాస్ కు స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రియు చ‌ర్మాన్ని కాంతివంతంగా సైతం మెరిపిస్తుంది.కాబట్టి తప్పకుండా ఈ హెల్తీ స్మూతీని డైట్ లో చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube