మధుమేహులకు బెస్ట్ స్మూతీ ఇది.. రోజు ఉదయం తీసుకుంటే బోలెడు లాభాలు!

ఇటీవల కాలంలో మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.

ఇంటికి కనీసం ఒక్కరైనా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉంటున్నారు.అయితే మధుమేహులకు ( Diabetics )రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం పెద్ద సవాలుగా మారుతుంటుంది.

దానికి తోడు నీరసం, అలసట వంటివి కూడా చాలా ఇబ్బంది పెడుతుంటాయి.అయితే వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఇప్పుడు చెప్పబోయే స్మూతీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

"""/" / ఈ స్మూతీని రోజు ఉదయం తీసుకుంటే బోలెడు లాభాలు పొందుతారు.

మరి ఇంతకీ ఆ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా బ్లెండ‌ర్ తీసుకుని అందులో ఒక కప్పు త‌రిగి పెట్టుకున్న ఆపిల్ ముక్కలు ( Apple Slices )వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్,( Rolled Oats ) వన్ టేబుల్ స్పూన్ వేయించిన అవిసె గింజలు, ఒక గ్లాస్ సోయా పాలు, ( Soy Milk )హాఫ్ టేబుల్ స్పూన్ మునగాకు పొడి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / తద్వారా మన డయాబెటిస్ ఫ్రెండ్లీ స్మూతీ సిద్ధం అవుతుంది.ఈ స్మూతీ లో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Spoon Chia Seeds ) కలిపి రోజు మార్నింగ్ గా తీసుకోవాలి.

ఈ స్మూతీ బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.

చ‌క్కెర స్థాయిలో హెచ్చుత‌గ్గులను నిరోధిస్తుంది.అలాగే ఈ స్మూతీని ఉదయం తీసుకుంటే రోజంతా చాలా యాక్టివ్ గా ఉంటారు.

నీరసం అలసట వంటి స‌మ‌స్య‌లు వేధించకుండా ఉంటాయి.అంతే కాదు ఈ స్మూతీ వల్ల పీసీఓడీ మరియు పిసిఒఎస్ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన ఫీలింగ్ క‌లుగుతుంది.వెయిట్ లాస్ కు స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రియు చ‌ర్మాన్ని కాంతివంతంగా సైతం మెరిపిస్తుంది.కాబట్టి తప్పకుండా ఈ హెల్తీ స్మూతీని డైట్ లో చేర్చుకోండి.

పావురాలను ఉపయోగించి 50 ఇళ్లను దోచుకున్న దొంగ..