సాధారణంగా తెలుగు హీరోల సినిమాలను తమిళ ప్రజలు ( Tamil people )అసలే చూడరు.ఎంత పెద్ద టాలీవుడ్ స్టార్ హీరో సినిమా అయినా తమిళంలో బాక్సాఫీస్ కలెక్షన్లు తక్కువగానే ఉంటాయి.
అయితే టాలీవుడ్‌లో మాత్రం ఇలాంటి పరిస్థితి కనిపించదు.అంటే తమిళ హీరోలు నటించిన సినిమాలను కూడా తెలుగు వారు బాగా ఆదరిస్తారు.
సూర్య, కార్తీ, విశాల్, అజిత్, రజనీకాంత్ ధనుష్, విజయ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కోలీవుడ్ హీరోలు ( Kollywood heroes )మన టాలీవుడ్ మార్కెట్ ను చాలా రోజులుగా బాగా వాడుకుంటున్నారు.ఇక్కడ అతిపెద్ద హిట్స్ సాధిస్తున్నారు.
కొత్తగా విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) కూడా యాడ్ అయ్యాడు.మొన్నటిదాకా ఏ పాత్ర అయినా చేస్తానని విజయ్ సేతుపతి అన్నాడు కానీ ఇప్పుడు హీరో రోల్స్ మాత్రమే చేస్తానని మొండి పట్టుపట్టాడు.
ఇటీవల తమిళ యాక్షన్ థ్రిల్లర్ మహారాజ సినిమాతో ఇతను తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించాడు.రూ.20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది.ఈ కలెక్షన్స్ లో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా కోట్లు వచ్చాయి.తెలుగు మార్కెట్‌ను తనకు మంచిగా మార్చుకోవాలని ఈ హీరో అనుకుంటున్నట్లు సమాచారం.దానికి అనుగుణంగానే తన నెక్స్ట్ సినీ ప్రాజెక్టుల ప్రమోషన్లను కూడా డిజైన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక తెలుగు ప్రేక్షకుల్లో బాగా తెచ్చుకున్న మరొక కోలీవుడ్ నటుడు అజిత్( Kollywood actor Ajith ).ఈ హీరో కూడా టాలీవుడ్ మార్కెట్ పై కన్నేసాడు.ఇప్పుడు “గుడ్ బ్యాడ్ అగ్లీ” అనే ఒక తమిళ మూవీ తీస్తున్నాడు.
దీన్ని తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నాడు.మొన్నటిదాకా ఈ హీరో తెలుగు రాష్ట్రాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు కానీ ఇప్పుడు తెలుగు మార్కెట్ ను బాగా సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
తన “గుడ్ బాడ్ అగ్లీ”( Good Bad Ugly ) సినిమాని సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని అతను చూస్తున్నాడు.ఈ పండుగ సమయంలో తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు ఎలా పోటెత్తుతారో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.
దానిని క్యాష్ చేసుకోవాలని అజిత్ ప్లానేశాడు.

నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ ( Dhanush )సార్ సినిమాతో తెలుగులో ఒక బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించాడు.ఇప్పుడు శేఖర్ కమ్ముల కుబేర సినిమాతో తెలుగులో తన సినిమాల మార్కెట్ మరింత పెంచేసుకోవడానికి రెడీ అయ్యాడు.తెలుగులో హిట్ అయితే పాన్ ఇండియాలో కూడా హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
ఆ విధంగా పాన్ ఇండియా సక్సెస్ పై కూడా వీళ్లు దృష్టి సారిస్తున్నారు.