చియా సీడ్స్.( Chia Seeds ) చూడటానికి చిన్నగా ఉన్న పోషకాలు పరంగా వాటికవే సాటి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, విటమిన్ బి1, విటమిన్ బి3, ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.ఇలా ఎన్నో పోషకాలు చియా సీడ్స్ లో ఉంటాయి.
ఈ నేపథ్యంలోనే చాలా మంది చియా సీడ్స్ ను వాటర్ లో నానబెట్టి తీసుకుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే విధంగా చియా సీడ్స్ తో హెల్తీ లడ్డూను తయారు చేసుకుని సాయంత్రం వేళ రోజుకొకటి తీసుకుంటే బోలెడు లాభాలు మీ సొంతం అవుతాయి.
అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో అరకప్పు బాదం పప్పు( Almond ) వేసుకుని వేయించుకోవాలి.అదే పాన్ లో నాలుగు టేబుల్ స్పూన్లు నువ్వులు( Sesame Seeds ) వేసి వేయించుకుని చల్లారబెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న బాదం పప్పు మరియు నువ్వులతో పాటు ఒక కప్పు చియా సీడ్స్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి.ఇప్పుడు అదే మిక్సీ జార్ లో పది గింజ తొలగించిన ఖర్జూరాలు,( Dates ) ఇరవై వరకు ఎండు ద్రాక్ష మరియు రెండు టేబుల్ స్పూన్లు తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిలో వేసి బాగా కలిపి చిన్న చిన్న లడ్డూల మాదిరి చుట్టుకోవాలి.ఈ చియా సీడ్స్ లడ్డూను( Chia Seeds Ladoo ) ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని ఈవెనింగ్ టైంలో రోజుకు ఒకటి తింటే బోలెడు ఆరోగ్య లాభాలు మీ సొంతమవుతాయి.ముఖ్యంగా చియా సీడ్స్ లడ్డూలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువ సమయం పాటు సంతృప్తిగా ఉంచడంలో సహాయపడుతుంది.అతి ఆకలిని తగ్గిస్తుంది.వెయిట్ లాస్ కు తోడ్పడుతుంది.

చియా సీడ్స్ లడ్డూలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.అలాగే చియా సీడ్స్ లడ్డూలో మెగ్నీషియం, సోడియం, కాల్షియం, పొటాషియం మరియు ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లో కీలక పాత్ర పోషిస్తాయి.
అంతేకాదు చియా సీడ్స్ లడ్డూను నిత్యం తీసుకుంటే రక్తపోటును అదుపులో ఉంటుంది.గట్ హెల్త్ మెరుగుపడుతుంది.వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తుంది.శరీరం యొక్క కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ ఉత్పత్తి సైతం పెరుగుతుంది.