యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) గురించి డైరెక్టర్ ఎస్.ఎస్.
రాజుమౌళి( Rajamouli ) ప్రశంసల వర్షం కురిపించారు.ఎన్టీఆర్ రాజమౌళి మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే.
అయితే తాజాగా రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ ( RRR: Behind And Beyond ) ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా జపాన్లో పర్యటిస్తున్నారు.ఇక్కడ ఈ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో జపాన్( Japan )లో కూడా విడుదల చేయాలని భావించారు.
ఈ క్రమంలోనే రాజమౌళి జపాన్ లో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమాలోని కొమురం భీముడో పాటలో( Komuram Bheemudo Song ) ఎన్టీఆర్ నటించిన నటన గురించి రాజమౌళి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.కొమురం భీముడో లాంటి కష్టమైన పాటను చిత్రీకరించడం నాకు చాలా సులభమైందంటే దానికి కారణం ఎన్టీఆర్.అతడు గొప్ప నటుడని అందరికీ తెలుసు.
కానీ, ప్రత్యేకించి ఈ పాటలో ఎన్టీఆర్ నటన మరో స్థాయిలో ఉందని రాజమౌళి తెలిపారు.

అతడి శరీరంలోని అణువణువుతోనూ హావభావాలు పలికించాడు.నేను ఆ పాట చిత్రీకరణలో అతడి ముఖంపై కెమెరా పెట్టి పాట ప్లే చేశాను అంతే.అది ఎంతో గొప్పగా వచ్చింది.
ఈ పాట వెనక కొరియోగ్రాఫర్ ప్రతిభ కూడా ఉందనీ రాజమౌళి తెలిపారు.ఇలా ఎన్టీఆర్ నటన గురించి రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక ఎన్టీఆర్ సైతం వార్ 2, డ్రాగన్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.