జీలకర్ర( cumin ) అనేది ప్రతి వంటలో ఉపయోగించే మసాలా అని దాదాపు చాలామందికి తెలుసు.జీలకర్రలో మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం మరియు విటమిన్ b6 ఎక్కువగా ఉంటాయి.
అంతేకాకుండా జీలకర్ర ఫైబర్ మరియు పొటాషియం యొక్క మంచి మూలం అని చెప్పవచ్చు.జీలకర్ర తినడం వల్ల శరీరం యొక్క రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
బరువు తగ్గడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.చాలామంది పోషకాహార నిపుణులు( Nutritionists ) బరువు తగ్గడానికి జీలకర్ర నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.
బరువు తగ్గడానికి జీలకర్ర నీటిని ( Cumin water )ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.పోషకాహార వైద్యులు చెబుతున్న దాని ప్రకారం నీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.దీని కోసం రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు ఐదు నుంచి ఏడు కరివేపాకు ఆకులు వేయాలి.ఈ నీటిని వడపోసి ఉదయాన్నే తాగాలి.
రోజు ఈ డ్రింక్ తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది.అలాగే జీవక్రియ మరియు కరివేపాకు నీరు బి ఎం ఐ తగ్గించడంలోను ఉపయోగపడుతుంది.
ఇంకా చెప్పాలంటే జీలకర్ర మరియు కొత్తిమీర రెండు కూడా బరువును తగ్గిస్తాయి.బరువు తగ్గాలని ప్రయత్నించేవారు జీలకర్ర మరియు కొత్తిమీర గింజలను రాత్రి నీటిలో నానబెట్టాలి.ఉదయాన్నే ఈ నీటిని తాగాలి.ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు ఆకలికి దూరంగా ఉంచుతుంది.అలాగే మీ బరువును కూడా తగ్గిస్తుంది.అలాగే జీలకర్ర కొత్తిమీరను నీటిలో వేసి మరిగించి తాగితే కూడా కొవ్వు కరిగిపోతుంది.
ఇంకా చెప్పాలంటే జీలకర్ర లాగా నిమ్మకాయ కూడా బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ను ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి.
ఈ నీటిని ఉదయం బాగా మరిగించాలి.ఆ తర్వాత ఆ నీటిని వడగట్టి నిమ్మరసం కలిపి తాగడం ఎంతో మంచిది.
ఈ జీలకర్ర నీటిని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే క్రమంగా బరువు తగ్గుతారు.