అరటి పండు తిని తొక్కను పారేడం అందరికీ అలవాటే.కానీ, అరటి పండే కాదు.
దాని తొక్క సైతం మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.ఎందుకంటే అరటి తొక్కలోనూ బోలెడన్ని పోషక విలువలు నిండి ఉంటాయి.
అందు కారణంగానే కొందరు అరటి తొక్కలతో టీ తయారు చేసుకుని తాగుతుంటారు.అలాగే చర్మ సౌందర్యాన్ని పెంపొందించే శక్తీ అరటి తొక్కలకు ఉంది.
ముఖ్యంగా ముఖంపై ఏర్పడిన నల్ల మచ్చలను మటుమాయం చేయడానికి అరటి తొక్కలతో చేసిన ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఇంతకీ అరటి తొక్కలతో ఆయిల్‌ను ఎలా తయారు చేయాలి.? మరియు ఆ ఆయిల్‌ను ఎలా వాడాలి.? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా రెండు లేదా మూడు అరటి పండ్లకు ఉన్న తొక్కలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ అరటి తొక్క ముక్కలను ఎండలో బాగా ఎండ బెట్టి పొడి చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని.అందులో రెండు కప్పుల కొబ్బరి నూనె లేదా బాదం నూనెను పోయాలి.నూనె కాస్త వేడి అవ్వగానే అందులో మూడు టేబుల్ స్పూన్ల అరటి తొక్కల పొడిని వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు స్లో ఫ్లేమ్‌పై స్పూన్‌తో తిప్పుకుంటూ హీట్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లార బెట్టుకున్నాక.
ఆయిల్‌ను ఫిల్టర్ చేసుకోవాలి.చివరిగా ఇందులో రెండు విటమిన్ ఇ క్యాప్పుల్ ఆయిల్‌ను మిక్స్ చేస్తే బనానా పీల్ ఆయిల్ సిద్ధమైనట్టే.
రాత్రి నిద్రించే ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న బనానా పీల్ ఆయిల్‌ను ముఖానికి అప్లై చేసి కాసేపు మసాజ్ చేసుకుని నిద్రించాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే ముఖంపై ఒక్క నల్ల మచ్చ కూడా ఉండదు.పైగా స్కిన్ టోన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.