తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు ఒక స్థాయికి వెళ్లినప్పటికీ కొన్ని రోజుల వరకు ఫెడ్ అవుట్ అయిపోతూ ఉంటారు.అయితే కొందరు ఫెడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ కూడా సీరియల్స్ లో నటిస్తున్నారు కానీ కొందరు మాత్రం సినిమాల్లో కాకుండా సీరియల్స్ లోనే చేస్తూ వస్తున్నారు సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లో చేసే వారికి కూడా మంచి గుర్తింపు ఉంటుంది.
సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్టులు చాలామంది ఉన్నప్పటికీ కొందరు సీరియల్ ఆర్టిస్ట్ లు మాత్రం మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లానే కనిపిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళలో మొదటివారు శృతి.ఈ పేరు చెప్తే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ మొగలిరేకులు సీరియల్లో తమిళ్ తెలుగులో కలిపి మాట్లాడే ఆవిడ అని చెప్తే మాత్రం అందరికీ వెంటనే గుర్తొస్తుంది.
వాళ్ల అమ్మ కూడా ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందింది ఆమె పేరు నాగమణి అయితే ఒకరోజు హాలిడేస్ లో వాళ్ల అమ్మతో కలిసి షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఒక క్యారెక్టర్ కి అవసరం ఉండి శృతిని తీసుకున్నారు ఆ క్యారెక్టర్ లో తను ఇమిడిపోయి చాలా బాగా నటించడంతో ఆ తర్వాత కూడా కొన్ని సీరియల్స్ లో ఛాన్స్ లు వచ్చాయి అయితే శృతి చదువు పాడవుతుంది అని వాళ్ల అమ్మ అయిన నాగమణి గారు సీరియల్ లో నటించమని వచ్చిన వాళ్లతో శృతి ఇప్పుడు సీరియల్స్ లో నటించదు ఎందుకంటే తన చదువు పాడైపోతుంది అందుకే కొన్ని రోజులు తను నటించదు అని చెప్పడంతో వాళ్లు నాగమణితో అమ్మాయికి హాలిడేస్ ఉన్నప్పుడే షూటింగ్ పెట్టుకుంటాము అని చెప్పి మరి ఆవిడ తోనే ఆ క్యారెక్టర్ చేయించాడు.అయితే ఆ సీరియల్ లో ఆవిడ పాత్రకి మంచి పేరు రావడంతో వరసగా ఆఫర్స్ వచ్చాయి.
అన్నిటికంటే ముఖ్యంగా అప్పట్లో దూరదర్శన్ లో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన సీరియల్ ఋతురాగాలులో ఆవిడ పోషించిన పాత్ర కి మంచి గుర్తింపు వచ్చింది.దాంతో ఆవిడ వెనక్కి తిరిగి చూడకుండా చాలా సీరియల్స్ లో నటిస్తూ వచ్చింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో డాషింగ్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ డైరెక్టర్ అవ్వకముందు దూరదర్శన్ లో ఒక సీరియల్ ని కూడా చేశాడు దాంట్లో శృతి గారు కూడా నటించారు పూరి జగన్నాథ్ గారి మొదటి హీరోయిన్ కూడా శృతి గారే.ఆ తర్వాత ఆవిడ చాలా సీరియల్ లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు మొగలిరేకులు, చక్రవాకం, శ్రావణ సమీరాలు, కస్తూరి, మమతల కోవెల,ఋతురాగాలు, నాగాస్త్రం, కన్యాశుల్కం, చంద్రముఖి, లేడీ డిటెక్టివ్, ఇంటింటి రామాయణం లాంటి చాలా సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించారు.
మొగలిరేకులు సీరియల్ లో తను పోషించిన పాత్ర గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తమిళ్ రాకపోయిన సీరియల్లో తమిళ్ మాట్లాడుతూ తెలుగులో కూడా మాట్లాడేది.
చాలా సీరియల్స్ లో పాజిటివ్ క్యారెక్టర్ పోషించిన ఆవిడ నాగాస్త్రం సీరియల్ లో మాత్రం నెగిటివ్ క్యారెక్టర్ లో నటించి ఆ పాత్రలో కూడా తను బాగా చేసింది అనే గుర్తింపును సంపాదించుకుంది.ఆవిడకి సినిమాల్లో చేయడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అయినప్పటికీ స్నేహిగీతం, మీ శ్రేయోభిలాషి లాంటి సినిమాల్లో నటించారు.ఆడ భర్త అయిన మధుసూదన్ గారు కూడా చాలా సీరియల్స్ లో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపును సాధించారు ఆయన సీరియల్స్ లోనే కాదు సినిమాల్లో కూడా నటిస్తూ ఉంటారు.
శృతి సీరియల్స్ నటించడమే కాదు సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేసింది, అలాగే రేడియోలో కూడా పని చేసింది అలాగే యాంకరింగ్ కూడా చేసి మంచి గుర్తింపును సాధించింది.శృతి గారిని క్వీన్ ఆఫ్ టీవీ సీరియల్స్ అని పిలుస్తూ ఉంటారు.
సినిమాల్లో రవళి, సిల్క్ స్మిత, సురభి లాంటి యాక్టర్స్ కి తను డబ్బింగ్ కూడా చెప్పింది.అలాగే తను టీవీ షోలు కూడా చేసింది సూపర్ కిడ్, భలే చాన్సులే, బంగారు కోడిపెట్ట వంటి షోలకు హోస్ట్ గా చేశారు.