నటి చాందిని తమిళరసన్( Actress Chandini Tamilarasan ).ఈమె గురించి ప్రత్యేకంగా పనిచేయం అక్కర్లేదు.
ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది చాందిని.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అయితే ఈమె చూడ్డానికి హీరోయిన్ జెనీలియా( Genelia ) లాగే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.దీంతో ఇదే అవకాశాన్ని బాగా అందిపుచ్చుకొని కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తోంది.
చెన్నైలో పుట్టి పెరిగిన ఈ యువ నటి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులపై సూటిగా చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా నటి చాందిని మాట్లాడుతూ. సినిమా పరిశ్రమ సురక్షితమైంది.ఇక్కడ మనల్ని కాదని ఏదీ జరగదు.నో చెబితే ఎవరూ టచ్ చేసేందుకు సాహసించరు.నో మీన్స్ నో.వద్దు అంటే ఇక్కడ వద్దనే అని చిత్ర పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్( Casting couch ) పై యువ హీరోయిన్ చాందిని తమిళరసన్ కుండబద్ధలు కొట్టారు.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే ఈ వ్యాఖ్యలపై కొందరు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా అందరి విషయంలో అలాగే ఉండదంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే చాందిని తమిళరసన్ విషయానికి వస్తే.ఈమె సిద్ధు ప్లస్-2 అనే సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత నాన్ రాజావాగ పోగిరేన్,విల్ అంబు, కట్టాప్పావై కాణోమ్, మన్నర్ వాగైయ్యా, కసడ తపర, వంటి చాలా సినిమాల్లో నటించారు.
తెలుగులో కూడా బుజ్జి ఇలా రా రామ్ అసుర్ వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు.అలా తెలుగు తమిళం భాషల్లో కొన్ని సినిమాలలో నటించి బాగానే గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.