సినిమా అంటే చాలామందికి హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు.కానీ ఈ మధ్యకాలంలో దర్శకులు సైతం భారీగా ఎక్స్పరిమెంటులను చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.
మన తెలుగు సినిమా హావాని కొనసాగిస్తున్న వారిలో హీరోలతో పాటు దర్శకులు కూడా ఉండడం విశేషం…ఇక డైరెక్టర్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది.

మరి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే వాళ్ళు మంచి కథలను ఎంచుకొని వాళ్ళ ఫ్యాన్స్ నిరాశపరచకూడదనే ఉద్దేశ్యంతో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.ముఖ్యంగా రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ ( Rajamouli, Sukumar, Sandeep Reddy Vanga )లాంటి దర్శకులు ఈ జనరేషన్ లో ఉన్న మంచి దర్శకుల లిస్టులో చేరిపోయారనే చెప్పాలి.మరి వీళ్ళ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం.
ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళు చేసే ప్రతి సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం వల్ల వీళ్లకు క్రేజ్ పెరగడమే కాకుండా వీళ్ళ సినిమాలకు డిమాండ్ కూడా భారీగానే పెరుగుతుందనే చెప్పాలి.

ఇక ఇప్పటివరకు వీళ్ళు చేసిన పాన్ ఇండియా సినిమాలు అన్ని సూపర్ సక్సెస్ గా నిలుస్తున్నాయి.మరి సుకుమార్ తన తర్వాత సినిమాని రామ్ చరణ్ తో చేయబోతున్నాడు మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.అలాగే రాజమౌళి, మహేష్ బాబు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.
కాబట్టి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందనే అంచనాలైతే ఇప్పటికే మొదలయ్యాయి.సందీప్ రెడ్డివంగ ప్రస్తుతం ప్రబాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.
కాబట్టి ఈ సినిమా పాన్ వరల్డ్ నేపధ్యం లోనే తెరకెక్కుతుంది.మరి ఈ సినిమాతో మరోసారి ఆయన తన ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…