శ్రీరాముడు( Sri Ram ) మానవ అవతారం ఎత్తి ఒక మనిషి ఎలా జీవించాలి, మనిషి గుణాలు ఎలా ఉండాలో అన్న విషయాన్ని ప్రపంచానికి నేర్పించారు.రాముడు అందరికీ ఆదర్శంగా ఉన్నారు.
రామనామం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మంత్రం.ఇది మీకు ఎలాంటి తీవ్రమైన బాధల నుంచి కూడా ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటుంది.
భగవంతుని వెయ్యి నామాలను జపించడం ఒకసారి మాత్రమే రామ నామన్ని( Rama Namam ) చెప్పడంతో సమానం అని పండితులు చెబుతున్నారు.
ఈ మంత్రాన్ని పాటించడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.శ్రీ రామ్ జై రామ్ జై జై రామ్ ఇది జీవితంలోని క్లిష్టమైన సమస్యల నుంచి కూడా మీకు ఉపశమనాన్ని లభిస్తుంది.మీకు తీవ్రమైన బాధ ఉంటే ఉదాహరణకు ఆరోగ్య, అనారోగ్యం లేదా ఆర్థిక సమస్యలు ఉంటే ఈ మంత్రాన్ని చేపించడం వల్ల సమస్యలన్నీ దూరమవుతాయి.
ఓం రామాయ హం ఫట్ స్వాహా ఇది శ్రీరాముడికి అంకితం చేయబడిన తాంత్రిక మంత్రం.మీరు ఏదైనా వ్యాజ్యంలో చిక్కుకుంటే ఈ మాత్రం మిమ్మల్ని రక్షిస్తుంది.ఓం రామభద్రాయ నమః మీ కొనసాగుతున్న పని నిలిచిపోయిన లేదా మీ పని చివరి నిమిషంలో ఆగిపోయిన మీరు కోరుకున్న ఫలితాలను పొందడానికి ఈ మంత్రాన్ని పాటించవచ్చు.
ఓం నమో భగవతే రామచంద్రాయ ఈ మంత్రం మీ జీవితం నుంచి వినాశకరమైన సంఘటనలను దూరం చేస్తుంది.” క్లీం రామ్ క్లీం రామ్ ||” ముఖ్యంగా చెప్పాలంటే ఈ మంత్రాన్ని చేతబడి ( Black Magic ) నుంచి రక్షించే రక్షణ మంత్రం అని అంటారు.ప్రభావాలు, ప్రతికూల ఆత్మలతో సహా అన్ని రకాల ప్రతికూలతలను ఈ మంత్రం దూరం చేస్తుంది.
ఈ మంత్రాన్ని జపించేటప్పుడు మనసు మన ఆధీనంలో ఉండడం ఎంతో మంచిది.రామ మంత్రం పఠనం కోసం రుద్రాక్ష లేదా తులసి జపమాల ఉపయోగించాలి.జపించిన తర్వాత తప్పనిసరిగా పవిత్ర స్థలంలో ఉంచడం ఎంతో మంచిది.