మన దేశ వ్యాప్తంగా చాలా దేవాలయాలలో ఎంతో ఘనంగా, వైభవంగా దీపోత్సవాలు జరిగాయి.అయితే సుప్రసిద్ధ అగ్ని క్షేత్రం తిరువన్నామలైలో కార్తీక మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిసిపోయాయి.
మంగళవారం సాయంత్రం పర్వత శిఖరాగ్రహంపై మహాదీప దర్శనం కోసం లక్షలాది భక్తులు దేవాలయానికి తరలివచ్చారు.ఈ వేడుకలు రాత్రి 11 గంటలకు ముగిసాయి.
దేవాలయ శైవగమా పండితులు ఉత్సవాలు ముగింపును ప్రకటిస్తూ ధ్వజావరోహణం చేశారు.దీపోత్సవం అనంతరం ఆలయంలోని తీర్థ కొలనులో మూడు రోజుల తిప్పోత్సవం బుధవారం రాత్రి మొదలయింది.
ఆ సందర్భంగా సర్వలంకరణ శోభితుడైన చంద్రశేఖర స్వామిని తిప్పపై పవళింపజేశారు.
ఆ తర్వాత మంగళ వాయిద్యాలు శైవ పండితుల మంత్ర చరణ నడుమ మంత్రాలను పటిస్తున్నప్పుడు తిప్పను కొలనులో ఊరేగించారు.
ఇక గురువారం ఉదయం అరుణాచలేశ్వర స్వామి వారు గిరి ప్రదక్షిణ చేశారు.పర్వత శిఖరాగంపై 11 రోజులపాటు దీపం వెలుగుతుందని ఈనెల 16వ తేదీ వరకు ఆ జ్యోతి దర్శనం చేసుకోవచ్చని దేవాలయ నిర్వహించారు.
తమిళనాడులోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం తిరువన్నామలైలో కార్తీక మహోత్సవం వైభవంగా ముగియడంతో బుధవారం ఉదయం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు గిరి ప్రదక్షిణలు చేయడానికి భారీ ఎత్తున దేవాలయానికి వచ్చారు.
మహాదీపోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు సుమారు 20వేల భక్తుల వరకు మంగళవారం రాత్రి క్షేత్రంలోని విడిది గృహాలలో బస చేసి గిరి ప్రదక్షణకు సిద్ధమయ్యారు.ఆ తర్వాత బుధవారం ఉదయం 8.14 నిమిషములకు వేలాదిమంది భక్తులు గిరి ప్రదక్షణ మొదలుపెట్టారు.గురువారం ఉదయం తొమ్మిది 22 నిమిషముల వరకు భక్తులు విడుదలవారీగా గిరి ప్రదక్షిణ చేయనున్నారు.బుధవారం ఉదయం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరువన్నమలై వచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా రాష్ట్ర రవాణా సంస్థ నిర్వాహకులు గురువారం రాత్రి వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
LATEST NEWS - TELUGU