ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.05
సూర్యాస్తమయం: సాయంత్రం 05.54
రాహుకాలం: మ.02.36 నుంచి 03.58 వరకు
అమృత ఘడియలు: ఉ.08.45 నుంచి 09.20 వరకు
దుర్ముహూర్తం: ఉ.10.10 నుంచి 11.32 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది.అప్పులు చేసిన వారికి అవి తీర్చే సమయంలో కష్టాలు వస్తాయ్.స్నేహితులతో, బంధువులతో మంచి సమయాన్ని గడుపుతారు.
ఉద్యోగంలో కొంచం అశ్రద్ధ చూపిస్తారు.భాగస్వామితో సమయాన్ని ఆనందంగా గడిపేస్తారు.
వృషభం:

ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయ్.వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు ఈరోజు పెట్టకుండా ఉంటేనే మంచిది.ఈరోజు ఏర్పడిన పరిచయాలు చెడు మార్గాల్లో వెళ్లేలా చేస్తాయ్.మీ జీవిత భాగస్వామితో అనందంగా గడిపేందుకు మంచి సమయం దొరుకుతుంది.
మిథునం:

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉంటాయి.గతంలో పెట్టుబడి పెట్టిన డబ్బులో 50 శాతం మాత్రమే మీకు తిరిగొస్తుంది.మిగితాది అంత మీకు కాకుండా పోతుంది.కుటుంబ సభ్యుల సలహాలు తీసుకొని ముందడుగు వేస్తే మంచిది.పిల్లల వల్ల మీకు ఆనందం కలుగుతుంది.
కర్కాటకం:

ఈరోజు వత్తిడికు గురవుతారు.దాని నుంచి తప్పించుకోకుంటే ఆర్ధికంగా కష్టాలు పడుతారు.ముందు ధ్యానం చేస్తే మంచిది.
లేదంటే మీకు ఉన్న టెన్షన్ లో కోపం పెరిగి నోటి దురుసుతో మాట్లాడి అందరికి దూరం అవుతారు.కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది.
సింహం:

మీకు ఆర్థిక లాభాలు ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మనశ్శాంతిని పోగొట్టుకుంటారు.అందుకే అవసరం ఉంటే తప్ప ఆ విషయాల గురించి ఆలోచించకండి.మీ పిల్లలతో మంచి సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి.మీ స్నేహతులతో సంతోషంగా గడుపుతారు.మీ వైవాహిక జీవితం ఈరోజు ఎంతో అందంగా ఉంటుంది.
కన్య:

అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు.మీకు రావాల్సిన డబ్బులు తిరిగివస్తాయ్.విచ్చలవిడిగా చేసిన ఖర్చు తగ్గి ఆనందంగా జీవిస్తారు.వైవాహిక జీవితంలో ఎన్నో మార్పులు కనిపిస్తాయ్.మీ పిల్లల చదువుకు సంబంధించిన కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి.మీ అంచనాలను మించి ఫలితం కనిపిస్తుంది.
తులా:

ఈరోజు ఖర్చు విషయంలో చూసి చెయ్యాలి.లేదంటే కష్టాలు తప్పవు.మీ పిల్లలు, కుటుంబం ఈరోజు ఎక్కువగా ఖర్చు చేస్తారు.అదృష్టవంతులు అవ్వడానికి ఎంతో కృషి చేస్తారు.నిజమైన స్నేహితురాలు ఎవరు అనేది తెలుసుకుంటే మంచిది.
వృశ్చికం:

మీరు బాగా నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి వెళ్తారు.దాని వల్ల వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఎదర్కొంటారు.ఆర్ధికంగా పూర్తిగా నష్టపోతారు.
అనవసరమైన ఖర్చులు చేస్తారు.ఉద్యోగంలో అవమానాలు ఎదురవుతాయి.కానీ దైర్యంగా ఉండి ఒక 30 నిమిషాలు ధ్యానం చేస్తే మంచిది.
ధనస్సు:

ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.ఇంటి ఆర్ధిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయ్.బంధువులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాయి.
సీనియర్ల నుంచి సహా ఉద్యోగుల సపోర్ట్, మెచ్చుకోలు అందుతాయి.నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయిని ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాల్సి ఉంటుంది.
మకరం:
>

ఈరోజు ఎక్కువ శ్రమపడాల్సి ఉంటుంది.మీ నుంచి ఇతరులు ఏం ఆశిస్తున్నారో సరిగ్గా పని చెయ్యాలి.అతిగా ఖర్చు పెట్టడాన్ని తగ్గించడం మంచిది.ఎవరిపైనో కోపాన్ని ఎవరిపైనో చూపించకుండా ఉంటే మంచిది.టీవీ, ఫోన్లు చూడటం వల్ల వృధా అవుతుంది.మీ వైవాహిక జీవితం ఈరోజు ఎంతో అందంగా ఉంటుంది.
కుంభం:

ఉద్యోగరీత్యా ఈరోజు సమస్యలు ఎదర్కొంటారు.స్నేహితులు, బంధువుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది.ఆర్థికపరంగా లాభాలు ఉన్నప్పటికీ మానసికంగా మాత్రం నష్టాలు ఉంటాయి.కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చిన.ఎన్ని మాటలు పడిన కాస్త ప్రశాంతంగా ఒక అరగంట సేపు ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
మీనం:

ఈరోజు ఎంతో ప్రశాంతంగా ఉంటారు.మీరు కోరినది కోరినట్టు మీ వద్దకు చేరుతుంది.భార్య పిల్లలతో ఎంతో ఆనందంగా గడుపుతారు.
ఈరోజు మీ బంధువులు ఇంటికి వచ్చి కొన్ని సర్ప్రైజ్ లు ఇస్తారు.మీ ప్లాన్ కాస్త దెబ్బ తిన్న మీరు ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు.