గర్భధారణ సమయంలో బెల్లం తిన‌డం వ‌ల‌న‌ క‌లిగే అద్భుత ప్ర‌యోజ‌నాలివే!

మ‌హిళ‌ల జీవితంలో అత్యంత అందమైన క్షణాలలో గ‌ర్భం ధ‌రించ‌డం ఒక‌టి.ఈ సమయంలో అనేక కష్టాల‌ను కూడా ఎదుర్కొంటారు.

 Amazing Benefits Of Eating Jaggery During Pregnancy , Amazing Benefits ,  During-TeluguStop.com

కానీ వీటన్నింటికీ ఫలితం మధురంగా ​​ఉంటుంది.బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆమె తాను పడిన‌ బాధనంతా మరచిపోతుంది.

అయితే ఆ సమయంలో మానసిక అల‌జ‌డి ఏర్పడుతుంది.అటువంటి పరిస్థితిలో చాలా మంది మనసు ప‌రిప‌రివిధాల పోతుంది.

అటువంట‌ప్పుడు మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలనుకుంటే, బెల్లం మీకు ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపిత‌మ‌య్యింది.బెల్లం తక్కువ పరిమాణంలో తినడం గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తుంది.

హార్మోన్ల అసమతుల్యతను నిర్వహించడం నుండి, రోగనిరోధక శక్తిని పెంచడం వ‌రకూ చాలా ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.ఇప్పుడు బెల్లం అందించే ప్ర‌యోజ‌నాల‌ను తెలుసుకోండి.

1) బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.ఆరోగ్యకరమైన రక్త కణాల పెరుగుదలలో బెల్లం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

2) ఎముకలకు మేలు చేస్తుంది.బెల్లంలో మెగ్నీషియం ఉండటం వల్ల ఎముకలు బలపడతాయి.మీరు మీ రోజువారీ ఆహారంలో బెల్లం చేర్చుకోవచ్చు.

3) బెల్లం ఇన్ఫెక్షన్‌నుండి రక్షించడంలో సహాయపడుతుంది.రోగనిరోధక శక్తి సరిగా లేని వారికి బెల్లం ఎంతో మేలు చేస్తుంది.బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది.గర్భధారణ సమయంలో బెల్లం తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి.బెల్లంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చాలా ఉన్నాయి, ఇది ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

4) జీర్ణశక్తి మెరుగుపడుతుంది.గర్భధారణ సమయంలో మలబద్ధకం లేదా అజీర్ణం వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలుఉంటే, అప్పుడు బెల్లం తినండి.బెల్లం చక్కెర సహజ రూపం.

5) శ‌రీరంలో నీటి లోటును నివారిస్తుంది.ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఇది ఖచ్చితంగా జరుగుతుంది.ఈ సందర్భంలో బెల్లం మీకు సహాయం చేస్తుంది.

బెల్లంలో పొటాషియం, సోడియం ఉంటుంది.కాబట్టి ఇది ఎలక్ట్రోలైట్‌లను బ్యాలెన్స్ చేయడంలో సహాయకరంగా ఉంటుంది.

బెల్లం ఎలా తినాలంటే.చిన్న బెల్లం ముక్కను అలానే తినవచ్చు.టీలో కలుపుకోవాలనుకుంటే బెల్లం పొడిని తింటే బాగుంటుంది.బెల్లం ఎప్పుడు తినాలంటే.

గర్భం దాల్చిన మొదటి రెండు నెలల్లో తల్లికి ఐరన్ ఎక్కువగా అవసరం.ఈ సమయంలో రక్తహీనత ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అందువల్ల, ఐరన్ అవసరాన్ని చూసి, గర్భిణీ స్త్రీలు బెల్లం తినడం ప్రారంభించవచ్చు.అయితే గర్భ‌ధార‌ణ‌ మొదటి మూడు నెలల్లో బెల్లం తినాల‌నుకుంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్త‌మం.

Amazing Benefits Of Eating Jaggery During Pregnancy

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube