అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.స్పాట్ లెస్( Spotless ) మరియు గ్లోయింగ్ స్కిన్ కోసం ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే వేలకు వేలు ఖర్చు పెట్టి క్రీములు, సీరం లను కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే వాటి వల్ల ఫలితం ఎంత ఉంటుంది అనేది పక్కన పెడితే.
ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ రెమెడీ మాత్రం మీరు కోరుకునే చర్మాన్ని మీ సొంతం చేస్తుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు గింజ తొలగించిన ఖర్జూరాలను( Dates ) వేసుకోవాలి.అలాగే మూడు లేదా నాలుగు ఎండు ద్రాక్ష ( Raisins )వేసి చిన్న కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు మిక్సీ జార్ లో నానబెట్టుకున్న ఖర్జూరం మరియు ఎండు ద్రాక్ష వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్( Milk powder ), వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి కనుక ఈ న్యాచురల్ రెమెడీ ని ఫాలో అయ్యారంటే మీ స్కిన్ లో మార్పును మీరే గమనిస్తారు.ఈ రెమెడీ చర్మంపై ఎలాంటి మచ్చలనైనా మాయం చేస్తుంది.
స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది.

స్పాట్ లెస్ మరియు గ్లోయింగ్ స్కిన్ ను మీ సొంతం చేస్తుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా ఉంటాయి.వయసు పైబడిన కూడా చర్మం యవ్వనంగా మెరుస్తుంది.
కాబట్టి అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోవాలని కోరుకునే వారు తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేయండి.







