తెలుగు సినిమా ఇండస్ట్రీలోని దిల్ రాజుకి( Dil raju ) ప్రత్యేక స్థానం ఉంది.ఆయన మొదట్లో డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉండి ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి టాలీవుడ్( Tollywood ) ని శాసించే స్థాయికి ప్రస్తుతం ఎదిగారు.
ఈ సినిమా విడుదలైన దిల్ రాజు సహాయం లేనిదే బయటకు రాలేని పరిస్థితిలో ఈరోజు ఇండస్ట్రీ ఉంది అంటే అది ఒక రోజు పడిన కష్టం కాదు దాని కోసం దిల్ రాజు చాలానే మెట్లు ఎదగాల్సి వచ్చింది.మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదలవుతుంది అంటే దానికి సంబంధించిన థియేటర్స్ విషయం వచ్చేసరికి దిల్ రాజు పేరు అందరికన్నా ముందు ఉంటుంది.
సంక్రాంతి వస్తే చాలు అందరూ కూడా ఆయన పేరు చెప్పుకొని తిట్టేవాళ్ళు తిడుతుంటారు పొగిడే వాళ్ళు పొగుడుతూ ఉంటారు.

ఏది ఏమైనా దిల్ రాజు ప్రస్తుత సినిమా ఇండస్ట్రీలో శిఖరాలలోనే ఉన్నారు.కానీ దిల్ రాజు ఈరోజు ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారణం జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )అనే విషయం ఎవరికీ తెలియదు.కేవలం సినిమాపై ఉన్న ఇష్టం తోనే డిస్ట్రిబ్యూషన్ రంగం లోకి వచ్చారు.
నైజాం ఏరియాలో పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ డబ్బులు అర్జించేవారు.కొన్నిసార్లు పరాజయాలు తగిలి గట్టి దెబ్బలు ఉన్నాయి.
అయితే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది( Adi ) సినిమాకు సంబంధించిన నైజాం హక్కులను దిల్ రాజు కొనుక్కున్నారు ఆ టైంలో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో డబ్బుల వర్షం కురిసింది.

ఆ డబ్బులను నిర్మాణ రంగంలోకి పెట్టాలని భావించి దిల్ అనే సినిమాను తీశారు.ఈ సినిమాలో హీరో నితిన్ నటించగా వివి వినాయక్ దర్శకత్వం అందించారు.ఇక ఈ సినిమా కూడా హిట్ కావడంతో రాజు మరింత లాభాల బాట పట్టారు.
అక్కడ మొదలైన దిల్ రాజు సక్సెస్ నేడు అన్ని సినిమాలను శాసిస్తూ థియేటర్స్ ని గుప్పెట్లో పెట్టుకొని టాలీవుడ్ పై మకుటం లేని మహారాజులా కూర్చున్నారు.అలా దిల్ రాజుని ఆదర్శంగా తీసుకొని చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాణ రంగంలోకి వచ్చిన ఎవరు పెద్దగా సక్సెస్ అయిన దాఖలాలు లేవు.







