సాధారణంగా అమ్మాయిల్లో చాలా మంది సిల్కీ హెయిర్( Silky hair ) ను ఇష్టపడుతుంటారు.జుట్టును సిల్కీ గా మార్చుకునేందుకు రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు.
వేలకు వేలు ఖర్చుపెట్టి కెరాటిన్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు.అయితే కొందరు మాత్రం సహజంగానే తమ జుట్టును సిల్కీ గా మెరిపించుకోవాలని భావిస్తుంటారు.
అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని మీ జుట్టును సిల్కీ మరియు ఆరోగ్యంగా మారుస్తుంది.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేసి అవి మునిగేలా వాటర్ పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు వైట్ రైస్ వేసుకోవాలి.అలాగే నానబెట్టుకున్న అవిసె గింజలను వాటర్ తో సహా వేసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక ఎగ్ వైట్( Egg white ) తో పాటు రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) మరియు వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.నలభై నిమిషాల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.ముఖ్యంగా ఈ ప్యాక్ జుట్టును సహజంగానే సిల్కీ గా మరియు షైనీ గా మారుస్తుంది.
జుట్టును మెరిసేలా మరియు మృదువుగా చేస్తుంది.పొడి జుట్టును రిపేర్ చేస్తుంది.
జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది.అలాగే ఈ ప్యాక్ హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ వంటి సమస్యలను అరికడుతుంది.
హెయిర్ గ్రోత్ ను సైతం ఇంప్రూవ్ చేస్తుంది.