తమ దంతాలు మ్యుత్యాల మాదిరి తెల్లగా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు.కానీ, అందరివీ అలా ఉండటం అసాధ్యం.
కొందరి దంతాలు పసుపు రంగులో, గార పట్టినట్లు ఉంటాయి.అలా ఉన్నప్పుడు నలుగురిలో మనస్ఫూర్తిగా నవ్వలేరు, మాట్లాడలేరు.
ఈ క్రమంలోనే గార పట్టిన పసుపు దంతాలను వదిలించుకోవడం కోసం రోజుకు రెండు సార్లు బ్రెష్ చేస్తుంటారు.ఖరీదైన టూత్ పేస్ట్‌లను యూస్ చేస్తారు.
మౌత్ వాష్‌లను వాడుతుంటారు.అయినప్పటికీ కొందరి దంతాలు తెల్లగా మారవు.
ఇలా మీకు జరుగుతుందా.? అయితే అస్సలు బాధపడకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను మూడంటే మూడు రోజుల పాటు పాటిస్తే అందమైన మెరిసే తెల్లటి దంతాలు మీసొంతం అవుతాయి.మరి ఇంకెందుకు లేటు ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక ఆరెంజ్‌ను తీసుకుని మధ్యలోకి కట్ చేసి.జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, వన్ టేబుల్ స్పూన్ మీ రెగ్యులర్ టూత్ పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసే వరకు స్పూన్‌తో బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని యూస్ చేసి దంతాలను బ్రెష్‌తో రెండు నుంచి మూడు నిమిషాల పాటు సున్నితంగా తోముకోవాలి.

ఆపై గోరు వెచ్చని నీటితో శుభ్రంగా దంతాలను మరియు నోటిని క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి చప్పున మూడు రోజుల పాటు వరసగా చేస్తే ఎంత గారపట్టిన దంతాలు అయినా తెల్లటి ముత్యాల్లా మెరిసిపోవడం ఖాయం.కాబట్టి, తమ దంతాలు తెల్లగా లేవని బాధపడుతూ కూర్చోకుండా ఈ చిట్కాను ప్రయత్నించండి.