వేరుశెనగలు (పల్లీలు) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలుసిందే.వేరుశెనగల్లో ఉండే పోషకాలు.
అనేక జబ్బులను సైతం దూరం చేస్తాయి.అయితే కేవలం వెరుశెనగలే కాదు వేరుశెనగ నూనె కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుంది.
సాధారణంగా చాలా మంది రోజూ వంటలకు ఏవేవో నూనెలు వాడుతుంటారు.అయితే ఏవేవో నూనెలు కాకుండా వేరుశెనగ నూనె వాడితే చాలా మంచిదంటున్నారు నిపుణులు.
మరి వేరుశెనగ నూనె ప్రయోజనాలు ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఓ లుక్కేసేయండి.
వేరుశెనగ నూనె వాడడం వల్ల రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగి.
మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.ఫలితంగా గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది.
వేరుశెనగ నూనెలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది.అందువల్ల, వేరుశెనగ నూనెను వంటలకు వాడితే.
ఎముకలు, దంతాలు మరియు కండరాలు దృఢంగా మారతాయి.

ప్రాణాంతకరమైన క్యాన్సర్ వ్యాధి నుంచి రక్షించడంలోనూ వేరుశనగ నూనె సహాయపడుతుంది.వేరుశెనగ నూనెలో రెస్వెట్రాల్ మరియు పోలీఫెనాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలతో పోరాడి.
నాశనం చేస్తాయి.అలాగే వేరుశెనగ నూనె వాడటం వల్ల శరీర రోగ నిరోధక శక్తి కూడా బలపరిచి.
సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.ముఖ్యంగా ఈ కాలంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం చాలా అవసరం.
కాబట్టి, ఏవేవో నూనెలు కాకుండా వేరుశెనగ నూనెను ఉపయోగించండి.
వేరుశెనగ నూనెలో రెస్వెట్రాల్ యాంటీ యాక్సిడెంట్ ఉంటుంది.
ఇది యాంటీ యాక్సిడెంట్ అల్జీమర్స్ వ్యాధి రాకుండా సహాయపడడంతో పాటుగా.ఆలోచనా శక్తిని రెట్టింపు చేస్తుంది.
ఇక వేరుశెనగ నూనె సౌందర్య పరంగా అనేక ప్రయోజనాలనూ అందిస్తుంది.అవును, వేరుశెనగ నూనె వాడటం వల్ల.
అందులో ఉండే విటమిన్ ఈ చర్మంపై వచ్చే ముడతలను, సన్నని గీతలను తగ్గించి.యవ్వనంగా, కాంతివంతంగా మారుస్తుంది.