వర్షాకాలం మొదలైంది.దేశంలోని చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈ సీజన్ లో పాదాలను సంరక్షించుకోవడం ఎంత కష్టమో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు.వర్షపు నీటిలో నడవటం వల్ల పాదాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్లు తలెత్తి.
దుర్వాసన రావడం, దురద తదితర సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.అలాగే నీటిలో ఎక్కువ సేపు నానడం వల్ల పాదాలు డ్రైగా కూడా మారిపోతుంటాయి.
అయితే ఈ సమస్యల నుండి పాదాలను రక్షించుకోవాలంటే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ ను మీరు వాడాల్సిందే.మరి ఈ క్రిమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వాటర్ పోయాలి.వాటర్ హీట్ అయ్యేలోపు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల బీస్‌వ్యాక్స్, వన్ టేబుల్ స్పూన్ కోకనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకోవాలి.
ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడిచేయాలి.

ఈ మిశ్రమం చిక్కగా అవుతున్నప్పుడు రెండు టేబుల్ స్పూన్ల షియా బటర్ వేసి కలుపుతూ, కరిగిన తర్వాత దించేసి చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక.అప్పుడు అందులో మూడు చుక్కల చప్పున లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ వేసుకుని విస్కర్ సాయంతో బాగా కలిపితే క్రీమ్ సిద్ధం అవుతుంది.
ఈ క్రీమ్‌ను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవచ్చు.నిద్రించే ముందు పాదాలను వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకుని.ఆపై తయారు చేసుకున్న క్రీమ్‌తో మృదువుగా మర్దనా చేస్తే ఎటువంటి ఇన్ఫెక్షన్లూ దరిచేరవు.మరియు పాదాలు కోమలంగా, తేమగా కూడా ఉంటాయి.

ఇక ఈ క్రీమ్‌ను వాడటంతో పాటు పాదాలపై పేరుకున్న మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి.నెలకు ఒకసారైనా ఇంట్లోనే సహజ పద్ధతిలో పెడిక్యుర్ చేసుకోవాలి.స్నానం చేసిన వెంటనే పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.మరియు ఈ సీజన్‌లో బయట నుంచి తిరిగి రాగానే పాదాలను లిక్విడ్ వాష్‌తో తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.