సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఫాలో అవ్వడం అన్నది సహజం.చాలామంది ప్రతి ఒక్క సినిమాకు ఏదో ఒక రకమైన సెంటిమెంట్ ను వాడుతూనే ఉంటారు.
అలా సెంటిమెంట్లు ఉపయోగించిన తర్వాత సినిమాలో విడుదల అయ్యి సక్సెస్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.అటువంటి సెంటిమెంట్ ఒకటి టాలీవుడ్ హీరోయిన్ తమన్నాకు( heroine Tamannaah ) బాగా కలిసి వచ్చింది.
ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి అన్న విషయానికి వస్తే.హీరోయిన్ తమన్నా ఐటెం సాంగ్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ అనే మార్క్ ఇప్పుడు బాలీవుడ్ లో పడిపోయింది.
దీనికి కారణం స్త్రీ-2 సినిమా.

ఆ మూవీలో మిల్కీ బ్యూటీ( Milky Beauty ) చేసిన ఐటెంసాంగ్ పెద్ద హిట్.సినిమాకు అది బాగా కలిసొచ్చింది.దీంతో చాలా సినిమాల్లో తమన్నాను స్పెషల్ సాంగ్ లో తీసుకోవాలని చూస్తున్నారు మూవీ మేకర్స్.
ఇందులో భాగంగా రైడ్ 2లో తమన్నాను తీసుకున్నారు.ఆమెపై ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు.
కాగా తమన్నా తన కెరీర్ లో చాలా ఐటెంసాంగ్స్ చేసిన విషయం తెలిసిందే.తెలుగులో సరిలేరు నీకెవ్వరు, జై లవకుశ ( Jai Lava Kusa )లాంటి ఎన్నో సినిమాల్లో కనిపించింది.
కొన్ని మొహమాటానికి చేస్తే, మరికొన్ని భారీ పారితోషికం కోసం చేసింది.

రైడ్ 2 స్పెషల్ సాంగ్ ( Raid 2 Special Song )కోసం అమె కెరీర్ బెస్ట్ రెమ్యూనరేషన్ అందుకోబోతోంది.ఇకపోతే తమన్న సినిమాల విషయానికొస్తే తెలుగులో ఆమె చేసిన ఓదెల 2 విడుదలకు సిద్ధమైంది.ఆమె గ్లామర్ ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉండబోతోంది.
ఇలా ఒకవైపు బాలీవుడ్ టాలీవుడ్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు ఐటెం సాంగ్స్ లో కూడా మెరుస్తోంది ఈ ముద్దుగుమ్మ.వీటితో పాటుగా వెబ్ సీరిస్ లలో కూడా నటిస్తూ దూసుకుపోతోంది.
సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది తమన్న.