ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడే బరువు తగ్గటం అనేది సాధ్యం అవుతుంది.బరువు తగ్గాలని అనుకున్నపుడు వ్యాయామంతో పాటు మంచి ఆహారం కూడా ముఖ్యమే.ఇప్పుడు చెపుతున్న ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటే బరువు తగ్గటం ఖాయం.
బాదం
బాదంలో యాంటీఆక్సిడెంట్స్, న్యూట్రీషియన్స్, మరియు ప్రోటీన్స్ సమృద్ధిగా ఉండుట వలన బరువు తగ్గటంలో బాగా సహాయపడతాయి.బాదం నమలటం వలన విడుదలయ్యే ఫ్యాట్స్ కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.బాదాంలో పీచు పదార్ధం కూడా సమృద్ధిగా ఉండుట వలన బరువు తగ్గటంలో సహాయపడుతుంది.
కీరా దోశ
కీరా దోశలో నీటి శాతం ఎక్కువ కేలరీలు తక్కువగా ఉండుట వలన రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే బరువు తగ్గుతారు, అంతేకాక పొట్ట ఉబ్బరాన్ని కూడా తగ్గించటంలో బాగా సహాయపడుతుంది.
గుడ్డు
ప్రతి రోజు కోడిగుడ్డును ఆహారంలో తీసుకుంటే రెండు రేట్లు వేగంగా బరువు తగ్గుతారు.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ లో ఉండే మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్ పొట్టలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది.రోజుకి ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వాడితే సరిపోతుంది.
అరటిపండు
అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండుట వలన బరువు తగ్గటంలో సహాయపడుతుంది.పొటాషియం శరీరంలో ఉప్పు, నీటి శాతాన్ని తగ్గించటం వలన బరువు తగ్గుతాం.
సోంపు
సోంపులో ఫైబర్, మాంగనీస్, క్యాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణక్రియలో సహాయపడుతుంది.భోజనం అయిన తర్వాత ఒక స్పూన్ సోంపు గింజలను తీసుకుంటే అద్భుతంగా బరువు తగ్గటం గమనించవచ్చు.
పెరుగు
పెరుగులో ఉండే క్యాల్షియం కొలస్ట్రాల్ హార్మోన్ మీద పనిచేసి కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది.అంతేకాక పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా కడుపు ఉబ్బరం,గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది.
పుచ్చకాయ
పుచ్చకాయలో సుమారుగా 92 శాతం నీరు ఉంటుంది.అలాగే విటమిన్ ఎ మరియు సి, మరియు లైకోపిన్ ,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన బరువు తగ్గటంలో సహాయపడతాయి.
మష్రుమ్స్
మష్రుమ్స్ లో ఉన్న పోషకాలు బరువు తగ్గించటంలో సహాయపడతాయి.శాఖాహారులు మాంసాహారానికి బదులుగా మష్రుమ్ ను తీసుకోవడం వల్ల క్యాలరీలను తగ్గిస్తుంది మరియు బరువును కూడా తగ్గిస్తుంది.
హాట్ చిల్ పెప్పర్స్
భోజనం చేయటానికి అరగంట ముందు హాట్ చిల్ పెప్పర్స్ తీసుకోవటం వలన ఎక్కువ ఆహారాన్ని తీసుకోలేరు.మాములుగా తీసుకొనే ఆహారంలో సుమారుగా 10 శాతం తక్కువ ఆహారాన్ని తీసుకోవటం వలన బరువు తగ్గుతారు.