టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood industry ) మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో తరుణ్ భాస్కర్ ( Tarun Bhaskar )ఒకరు.తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది, కీడా కోలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రశంసలు అందుకున్నాయి.
విభిన్నమైన సినిమాలను తెరకెక్కించడం ద్వారా తరుణ్ భాస్కర్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు.పలు సినిమాలలో నటుడిగా నటించిన తరుణ్ భాస్కర్ ఆ సినిమాలతో ప్రశంసలు అందుకున్నారు.
నాన్న కల నెరవేర్చడం ద్వారా తరుణ్ భాస్కర్ వార్తల్లో నిలవడం హాట్ టాపిక్ అవుతోంది.తరుణ్ భాస్కర్ తల్లి సైతం పలు హిట్ సినిమాలలో నటించి మెప్పించారు.
తరుణ్ భాస్కర్ తండ్రి ఉదయ్ భాస్కర్ చాలా సంవత్సరాల క్రితమే మృతి చెందారు.అయితే సొంతిల్లు కట్టుకోవాలనేది ఆయన కల కాగా ఆ కలను నెరవేర్చానని చెబుతూ తరుణ్ భాస్కర్ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పోస్ట్ చేశారు.

“కల నెరవేర్చాను నాన్న.నువ్వు చూస్తున్నావనే అనుకుంటున్నా” అంటూ తరుణ్ భాస్కర్ రాసుకొచ్చారు.ప్రస్తుతం తరుణ్ భాస్కర్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉండగా ఈ సినిమాలో ఈషా రెబ్బా( Isha Rebba ) హీరోయిన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది.త్వరలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
తరుణ్ భాస్కర్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు భావిస్తున్నారు.

తరుణ్ భాస్కర్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తరుణ్ భాస్కర్ పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
తరుణ్ భాస్కర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.తరుణ్ భాస్కర్ స్టార్ హీరోలతో సినిమా తెరకెక్కిస్తే బాగుంటుందని చెప్పవచ్చు.







