జీవితంలో కలలు చాలా ముఖ్యమైనవి.డ్రీమ్ సైన్స్( Dream science ) ప్రకారం నిద్రలో కనిపించే కలలు మన భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను సూచిస్తాయి.
అయితే కొన్ని కలలలో శుభ, అశుభ గుణాలు ఉంటాయి.నిద్రలో ప్రతి ఒక్కరికి కూడా కలలు వస్తాయి.
ఇవి కొన్నిసార్లు మంచివైతే, కొన్నిసార్లు చెడ్డవిగా ఉంటాయి.డ్రీమ్ సైన్స్ ప్రకారం నిద్రలో కనిపించే కలలు భవిష్యత్తు సంఘటనలను సూచిస్తాయి.
అయితే ఉదయాన్నే నిద్ర లేవగానే కొన్ని కలలు మర్చిపోతాము.కానీ బ్రహ్మ ముహూర్తంలో కనిపించే కలలు మాత్రం నిజమవుతాయి.
అదే విధంగా మనకు గుర్తు కూడా ఉంటాయి.సూర్యోదయానికి 72 నిమిషాల ముందు బ్రహ్మముహూర్తం వస్తుంది.
అయితే ఆ సమయంలో ఈ కలలు వస్తే మీ కష్టాలన్నీ తీరిపోయినట్లే.
అలాగే జీవితంలో పురోగతి, లాభం, ఆనందం, అదృష్టం కూడా ఉంటుంది.ఈ కల 3 గంటల నుండి 5 గంటల మధ్య కనిపిస్తే అది నెరవేరుతుంది.బ్రహ్మముహూర్తంలో ఏ ఏ కలలు వస్తే శుభప్రదమో, ఏ కళలు వస్తే పురోగతి, అభివృద్ధి, ధన లాభాన్ని సూచిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రహ్మ ముహూర్తంలో గంగా నదిలో లేదా మరి ఏదైనా నదిలో స్నానం చేస్తున్నట్లు కనిపిస్తే నిలబడిపోయినా పనులన్నీ పూర్తవుతాయి.అలాగే ఈ కల చాలా ఫలవంతమైనది.
ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా తిరిగి వస్తుంది.పాత పెట్టుబడిలో లాభం ఉంటుంది.
కలలో పిల్లాడు నవ్వుతున్నట్టు కనిపిస్తే లేదా ఎవరైనా చాలా సంతోషంగా కనిపిస్తే ఇది చాలా శుభప్రదం.ఈ కల సమీప భవిష్యత్తులో ఆర్థిక లాభాలను సూచిస్తుంది.అలాగే లక్ష్మీదేవి( Goddess Lakshmi ) త్వరలో మీ ఇంటికి ప్రవేశిస్తుందని సూచిక.కలలో కుండ లేదా నీళ్లతో నిండిన కాడ కనిపిస్తే సంతోషకరమైన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోవాలి.
ఈ కల మీ డబ్బు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.అలాగే భవిష్యత్తులో మీకు ఎలాంటి డబ్బు లోటు ఉండదని చెబుతోంది.ఒక వ్యక్తి దంతాలు విరిగిపోయినట్లు కనిపిస్తే ఈ కల కూడా శుభసంకేతం.వ్యాపారంలో లాభం పొందుతారు అని దీనికి అర్థం.
అలాగే మీ గొప్ప కోరికలు కూడా నెరవేరుతాయి అని అర్థం.
DEVOTIONAL