శ్రీ కృష్ణ భగవానుడు తన భక్తులైన బిల్వమంగళుడు, గురూరమ్మ ఇంటికి విచ్చేసి నిత్యమూ
విందుభోజనం చేసి వెళ్ళే మహద్భాగ్యాన్ని పొందారు.
బిల్వమంగళుడు.
ఏకాదశీ , దశమి మరియు శ్రవణ నక్షత్రం రోజులలో తులసి తీర్ధం మాత్రమే పుచ్చుకుని ఉపవసించడం ఆచారంగా అనుసరిస్తూ
వచ్చాడు.కానీ,శ్రీకృష్ణుడు మాత్రం ఆ పుణ్యదినాలలో చక్కెర పొంగలి,
పాల పాయసం అడిగి చేయించుకొని ఎంతో ప్రియంగా తినే వాడు.
ఒకనాడు బిల్వమంగళునిఇంటికి అతని స్నేహితుడు వచ్చాడు.కడుపునొప్పితో తాను
బాధ పడుతున్నానని చెప్పిన ఆ స్నేహితుడు, భగవాన్ కృష్ణునితో చెప్పి తన బాధను తీర్చమని కోరాడు.
పిదప భగవంతుని దర్శించిన బిల్వమంగళుడు” తన స్నేహితుడు.కడుపు నొప్పితో బాధపడుతున్నాడు , మీకు చెప్పమని చెప్పాడు.” ఆని అన్నాడు.
తక్షణమే శ్రీ కృష్ణుడు ” ఇది పూర్వ జన్మ కర్మ ఫలితం.
నేనేమి చేయలేను “అన్నాడు.
ఇదే విషయం తన మిత్రునికి తెలిపాడు బిల్వమంగళుడు.
ఈ సమాధానంతో
మనసు బాధ పడగా ఆ మిత్రుడు, గురూరమ్మని
కలుసుకున్నాడు.తన కడుపు నొప్పి బాధను తీర్చమని భగవంతుని
ప్రార్ధించమని ఆమెను కూడా వేడుకున్నాడు.
ఆ తరువాత , ప్రతిరోజూ వస్తున్నట్టే తమ ఇంటికి
వచ్చిన శ్రీకృష్ణుని ప్రేమగా ఆహారం వడ్డించింది.గురూరమ్మ, పిదప మిత్రుని కడుపు నొప్పి బాధ చెప్పి , నీవల్లనే అతని బాధ తగ్గించబడుతుంది” అని భక్తితో ప్రార్ధించింది.
ఆమె ప్రార్ధనను స్వీకరించిన శ్రీ కృష్ణుడుమిత్రుని కడుపునొప్పి తగ్గించి కటాక్షించాడు.
ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు ఆ మిత్రుడు.
బిల్వమంగళుని వద్దకు వెళ్ళాడు.గురూరమ్మ ప్రార్ధనతో తన ఉదర బాధ తీరినట్టు చెప్పాడు.
బిల్వమంగళునికి కృష్ణునిపై కోపం, ఉక్రోషం కలిగింది.తను వేడుకొన్నప్పుడు భగవంతుడు తన మాటను వినిపించుకోలేదే అనే చింత కలిగి భగవంతుని అడగనే అడిగాడు.అందుకు శ్రీకృష్ణుడువెంటనే ” బిల్వమంగళా ! మిత్రుని ఉదరబాధను గురించి నీవు చెప్పడం ఏదో సాధారణ విషయం చెప్పినట్లు మాత్రమే వున్నది.అందుకే ఉదర బాధ వచ్చిన కారణం మాత్రమే నీకు తెలిపాను.
కాని నీ భార్య గురూరమ్మ ప్రార్ధనలో మాతృప్రేమ నిండి వున్నది.నీ మిత్రుని ఉదరబాధ తొలగించాలనే తపన వున్నది.ఆత్మార్ధమైన పవిత్ర భక్తి , ప్రేమలతో వేడుకునే భక్తుల కోరికలు నేను తప్పక నెరవేరుస్తాను.” అని విశదపరిచాడు.
సత్యం గ్రహించిన బిల్వమంగళుడు కన్నీటితో భగవాన్ శ్రీ కృష్ణుని భక్తితో నమస్కరించాడు.