Actress Jayasudha : మూడో పెళ్లి గురించి జయసుధ షాకింగ్ రియాక్షన్.. ఇంట్లో సరిగ్గా పెరగని వాళ్లే అలా చేస్తారంటూ?

సీనియర్ నటి, సహజ నటి జయసుధ( Senior Actress Jayasudha ) వయస్సు ప్రస్తుతం 65 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.వయస్సుకు తగిన పాత్రల్లో నటిస్తున్న జయసుధ వచ్చిన ప్రతి ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.

 Jayasudha Comments About Third Marriage Details Here Goes Viral In Social Media-TeluguStop.com

జయసుధ పారితోషికం( Jayasudha Remuneration ) కూడా పరిమితంగా ఉంది.జయసుధ మూడో పెళ్లి గురించి సోషల్ మీడియా వేదికగా వేర్వేరు సందర్భాల్లో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఆ కామెంట్లు జయసుధ దృష్టికి కూడా వచ్చాయి.తాజాగా జయసుధ మూడో పెళ్లి గురించి మాట్లాడుతూ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

మూడో పెళ్లి వార్తల గురించి తాను రియాక్ట్ కావాలని అనుకోవడం లేదని జయసుధ అన్నారు.సోషల్ మీడియాలో తన మూడో పెళ్లి గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

మూడో పెళ్లి( Jayasudha Third Marriage )కి సంబంధించిన వార్తలతో పోల్చి చూస్తే ఆ వార్తల కింద వస్తున్న కామెంట్లే మరీ దారుణంగా ఉన్నాయని జయసుధ తెలిపారు.ఇంట్లో సరిగ్గా పెరగని వాళ్లు అలాంటి కామెంట్లు చేస్తారని నేను ఫీలవుతానని ఆమె వెల్లడించారు.పెళ్లి గురించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని ఇండిపెండెంట్ గా జీవనం సాగించడానికి నేను ఆసక్తి చూపుతానని జయసుధ క్లారిటీ ఇచ్చారు.

కరోనా( Corona ) సమయంలో టెన్షన్ పడటం వల్ల వెయిట్ లాస్ అయ్యానని ఆమె అన్నారు.90 రోజుల సమయంలో 16 కిలోల బరువు తగ్గానని జయసుధ పేర్కొన్నారు.హెయిర్ డై వేసుకోకుండా ఫోటో దిగగా ఆ ఫోటో వైరల్ అయిందని ఆ సమయంలో ఏదో ఆరోగ్య సమస్యతో నేను బాధ పడుతున్నానని ప్రచారం చేశారని ఆమె తెలిపారు.

వ్యూస్, డబ్బుల కోసం ఇష్టానుసారం వార్తలు ప్రచురించారని జయసుధ వెల్లడించారు.జయసుధ క్లారిటీతో ఇకనైనా ఈ వార్తలు ఆగుతాయేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube