రామారావు ఆన్ డ్యూటీలో జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారా.. అసలేమైందంటే?

ఈ మధ్య కాలంలో విడుదలవుతున్న సినిమాలు వివాదాలలో చిక్కుకుంటున్నాయనే సంగతి తెలిసిందే.తాజాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమా థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమా ఫ్లాప్ అని మార్నింగ్ షోకు తేలిపోయింది.

 Jagan Sarkar Targetted In Ramarao On Duty Movie Details Here Goes Viral , Jagan,-TeluguStop.com

రవితేజ కథల ఎంపికలో జాగ్రత్త వహించాలని కథల ఎంపికలో తప్పులు చేస్తే ఆయన కెరీర్ కు నష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్లు వైసీపీని టార్గెట్ చేసేలా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

శరత్ మండవ సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆయన వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ మద్దతుదారుడని తేలింది.గతంలో శరత్ మండవ వైసీపీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి.

రామారావు ఆన్ డ్యూటీలో ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సీన్లు ఉండటంతో రామారావు ఆన్ డ్యూటీ డైరెక్టర్ పై చాలామంది ఫైర్ అవుతున్నారు.జగన్ సర్కార్ ను టార్గెట్ చేసి డైలాగ్స్ రాశారని కామెంట్లు చేస్తున్నారు.

రామారావ్ ఆన్ డ్యూటీకి నెగిటివ్ టాక్ రావడానికి వైసీపీ కార్యకర్తలు కూడా ఒక కారణమని తెలుస్తోంది.కొన్నిరోజుల క్రితం మాచర్ల నియోజకవర్గం డైరెక్టర్ కూడా ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని డైరెక్టర్లు టార్గెట్ అవుతుండటం గమనార్హం.డైరెక్టర్లు వివాదాలలో చిక్కుకోవడం వల్ల సినిమాలకు మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Ivral, Ramarao Duty, Raviteja, Sarat Mandava, Ycp-Movie

యంగ్ జనరేషన్ డైరెక్టర్లు వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని అభిమానులు కోరుకుంటున్నారు.వివాదాలలో చిక్కుకోవడం వల్ల బాగున్న సినిమాలకు సైతం నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.టాలీవుడ్ హీరోలు సైతం వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటే మంచిది.రామారావు ఆన్ డ్యూటీ నిర్మాతలకు భారీ నష్టాలు తప్పవని తేలిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube