Lip cream lips : వింటర్ లో ప‌గిలిన పెదాల‌ను రిపేర్ చేసే బెస్ట్ హోం మేడ్ క్రీమ్ మీకోసం!

ప్రస్తుతం వింటర్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్‌లో ప్రధానంగా వేధించే సమస్యల్లో పెదాల పగుళ్లు ముందు వరసలో ఉంటుంది.

 This Is The Best Homemade Cream To Repair Chapped Lips In Winter! Homemade Cream-TeluguStop.com

అందులో ఎటువంటి సందేహం లేదు.వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తేమ తగ్గిపోయి పెదాలు తరచూ పగిలిపోతూ ఉంటాయి.

పగిలిన పెదాలను రిపేర్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇక‌పై అస్సలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ లిప్ క్రీమ్ ను క‌నుక వాడితే పగిలిన పెదాలు రిపేర్ అవ్వడమే కాదు మళ్ళీ మళ్ళీ పెదాల పగుళ్లు సమస్య దరిచేరకుండా సైతం ఉంటుంది.

మరి ఇంతకీ వింటర్ లో పెదాలను పగలకుండా రక్షించే ఆ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందు పది బాదం పప్పులు ఒక గిన్నెలో వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

అలాగే మరో గిన్నెలో పావు టేబుల్ స్పూన్ కుంకుమపువ్వు, నాలుగు టేబుల్ స్పూన్లు రోజు వాటర్ వేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మ‌రుస‌టి రోజు మిక్సీ జార్ లో నానబెట్టుకున్న బాదం పప్పులను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మం నుండి బాదం పాలను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కుంకుమ పువ్వును నానబెట్టుకున్న రోజ్ వాటర్ ను వేసుకోవాలి.

Telugu Tips, Chapped Lips, Homemade Cream, Latest, Lip Care, Lip Cream, Lips-Tel

ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్లు బాదం పాలు, మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సహాయంతో రెండు నుంచి మూడు నిమిషాల పాటు మిక్స్ చేస్తే లిప్ క్రీమ్‌ సిద్ధం అవుతుంది.ఈ లిప్‌ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ క్రీమ్‌ను రోజుకు రెండు నుంచి మూడుసార్లు పెదాలకు అప్లై చేసుకుంటూ ఉండాలి.ఈ హోమ్ మేడ్ లిప్‌ క్రీమ్ ను వాడటం వల్ల పెదాల పగుళ్లు నుంచి చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది.

అదే సమయంలో మళ్ళీ మళ్ళీ పెదాలు పగలకుండా కూడా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube