ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసు నుంచే రక్తపోటు,చక్కెర వ్యాధి, ఉబకాయం చాలామందిలో పెరిగిపోతున్నాయి.అలాంటి వాటికి ఒక కూరగాయను ఉపయోగించి నియంత్రణ చేయవచ్చు.
మనం తినేవే కాకుండా, చూడనివి అసలు తెలియని కూరగాయలు కూడా ఎన్నో ఉన్నాయి.వాటి పేర్లు కూడా మనం సరిగ్గా విని ఉండము.
బీట్రూట్ లాగే ఒక కూరగాయ ఉంటుంది.అది టర్నిఫ్ రుచిలో బంగాళాదుంప, కనిపించడంలో ముల్లంగి, బీట్రూట్ ల కనిపిస్తూ ఉంటుంది.
భారతదేశంలో దీన్ని సెల్గం అని పిలుస్తూ ఉంటారు.
తెలుపు ఊదా రంగులో ఇది లభిస్తూ ఉంటుంది.
ఈ కూరగాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.వాటిలో క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఇందులో ఉన్నాయి.
క్రూసిఫెరస్ కుటుంబానికి చెందిన ఈ కూరగాయ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
టర్నిప్‌లో రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచే డైటరీ నైట్రేట్‌లు అధికంగా ఉన్నాయి.పొటాషియం ఇందులో సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.ధమనులు వ్యాకోచించేలా చేసి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
క్రూసిఫెరస్ కూరగాయలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.వీటిలో క్యాన్సర్ కి వ్యతిరేకంగా పనిచేసే సమ్మేళనాలు ఉంటాయి.
యాంటీ క్యాన్సర్ ప్రభావం కలిగిన ఈ కూరగాయ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఇరవై మూడు శాతం తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అంతేకాకుండా ఈ కూరగాయలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా అధికంగా ఉన్నాయి.ఇది ప్రతిరోజు తినడం వల్ల గ్లూకోస్ స్థాయిలను నియంత్రిస్తూ ఉంటుంది.మధుమేహ రోగులు దీన్ని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
అధిక మొత్తంలో ఫైబర్, తక్కువ కేలరీలు కలిగి ఉండడం వల్ల ఇది తిన్నప్పుడు పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని చాలాసేపు వారికి అలాగే ఉంటుంది.దీనివల్ల అతిగా తినడాన్ని తగ్గించవచ్చు.
బరువు కూడా అదుపులో ఉంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.