నల్లగా ఉన్న ఆహార పదార్థాలను తినకుండా వదిలేస్తున్నారా.. అయితే ఈ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అయినట్లే..!

ఆహారం సరైన పద్ధతిలో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యంగా ఉండడానికి బ్లాక్ ఫుడ్స్( Black foods ) ఎంతగానో ఉపయోగపడతాయి.

 Do You Avoid Eating Black Food Items But These Amazing Health Benefits Seem To B-TeluguStop.com

అయితే ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని బ్లాక్ ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.మీరు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే వీటిని కూడా కచ్చితంగా తీసుకోవాలి.

ముఖ్యంగా చెప్పాలంటే నల్ల వెల్లుల్లి ఆహారం యొక్క రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

Telugu Black Fig, Black Foods, Black, Garlic, Tips-Telugu Health Tips

వెల్లుల్లి ( garlic )గుండెకు చాలా ఉపయోగమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల ఎన్నో వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది.ఇంకా చెప్పాలంటే చాలామందికి నల్ల బియ్యం( Black rice ) గురించి అసలు తెలియదు.

నల్ల బియ్యం లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.బ్లాక్ రైస్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు మనల్ని ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి.

అలాగే నల్ల ద్రాక్షలో పిండి పదార్థాలు, చక్కెర క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ఫైబర్ అలాగే విటమిన్ సి లాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.ఈ ద్రాక్ష ఎముకలకు, జుట్టుకు, చర్మానికి, రక్తహీనతకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే ప్రోటీన్ లోపన్ని దూరం చేసుకోవడానికి మినుములు ఎంతగానో ఉపయోగపడతాయి.వీటిలో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, క్యాల్షియం, విటమిన్ b6 ఎక్కువగా ఉంటాయి.

మినుములు తినడం వల్ల గుండెతో పాటు నాడీ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది.

Telugu Black Fig, Black Foods, Black, Garlic, Tips-Telugu Health Tips

ముఖ్యంగా చెప్పాలంటే నల్ల అత్తి పండు( Black fig ) ఎంతో తీపిగా ఉంటుంది.కానీ దీనిలో చక్కెర పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది.ప్రోటీన్ ఫైబర్ లాంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఈ నల్ల అత్తి పండు ను తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

నిత్యం రెండు నల్ల అత్తిపండ్లను రాత్రి నానబెట్టి ఉదయం తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube