అమెరికాలో గ్రీన్ కార్డు( US Green Card ) అనేది వలసదారులకు అక్కడ శాశ్వత నివాస హక్కును కల్పించే ముఖ్యమైన పత్రంగా పరిగణించబడుతుంది.ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది గ్రీన్ కార్డు పొందేందుకు దరఖాస్తు చేస్తుంటారు.
ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా హెచ్-1బీ వీసాల( H1-B Visa ) ద్వారా అమెరికా చేరుకుని, గ్రీన్ కార్డు కోసం వేచిచూస్తూ ఉంటారు.అయితే, గత కొన్ని సంవత్సరాలుగా గ్రీన్ కార్డు పొందే ప్రక్రియ మరింత కఠినతరమవుతోంది.
డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) అధ్యక్షతన వలసదారులపై తీసుకుంటున్న కఠిన చర్యల ప్రభావం ఇప్పుడు గ్రీన్ కార్డుల మీద కూడా పడింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక వలసదారులపై మరింత కఠిన చర్యలు తీసుకుంటూ వస్తున్నారు.
తాజా పరిణామాల్లో, భారతీయులు దాఖలు చేసిన 2 వేల గ్రీన్ కార్డు దరఖాస్తులను ట్రంప్ సర్కార్ ఫ్రీజ్ చేసింది.ఈ నిర్ణయానికి కారణంగా, భారతీయులకు గ్రీన్ కార్డు పొందే ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది.
ట్రంప్ ప్రభుత్వం తెలిపిన సమాచారం ప్రకారం, ఈ దరఖాస్తులలో కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం వల్లనే వాటిని నిలిపివేయాల్సి వచ్చిందని స్పష్టంచేశారు.

భారతీయులపై గ్రీన్ కార్డు ఫ్రీజ్ ప్రభావం ఎలా ఉందంటే.ఈ నిర్ణయం భారతీయులకు పలు విధాలుగా ప్రతికూలంగా మారే అవకాశముంది.ముఖ్యంగా, దీనివల్ల ఐదు ప్రధాన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అవి ఏమిటంటే .ఇప్పటికే భారతీయుల కోసం గ్రీన్ కార్డు వెయిటింగ్ సమయం దశాబ్దాలుగా ఉంది.ఇప్పుడు ఈ తాజా నిర్ణయం వల్ల మరింత ఆలస్యం అవుతుంది.
అలాగే గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న హెచ్-1బీ వీసాదారులకు ఇది తలనొప్పిగా మారనుంది.వారి వర్క్ పర్మిట్ కాలం ముగిసిన తర్వాత, వీసా రద్దయ్యే అవకాశముంది.

ఇంకా భారతీయ దంపతులు లేదా కుటుంబాలు, తమ గ్రీన్ కార్డు కోసం అమెరికాలో ఉండిపోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.అయితే, ప్రాసెసింగ్ ఆలస్యం వల్ల వారిని కుటుంబాల నుంచి దూరంగా ఉంచే పరిస్థితి ఏర్పడే అవకాశముంది.అమెరికాలో గ్రీన్ కార్డు ఆలస్యం కావడంతో, భారతీయ టెక్నాలజీ నిపుణులు( Indian Techies ) కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు మళ్లే అవకాశాలు పెరుగుతున్నాయి.అలాగే వలసదారుల కోసం అమెరికా ప్రభుత్వం అనేక మార్పులు చేస్తుండడంతో, శరణార్థుల భవిష్యత్ మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.
ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం గ్రీన్ కార్డు దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిపివేసింది.అయితే, ఈ వ్యవహారం తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో స్పష్టత లేదు.
భారతీయ వలసదారులు ఇప్పటికే సక్రమంగా అమెరికాలో నివాసం ఉంటూ ఉన్నప్పటికీ, గ్రీన్ కార్డు కోసం నిరీక్షణ మరింత పెరిగిపోతోంది.చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలను మరింత కఠినతరం చేయడం వల్ల భారతీయులకు తీవ్ర నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది.
ఇప్పటివరకు గ్రీన్ కార్డు ప్రాసెసింగ్‌కు సంబంధించిన మార్పులపై స్పష్టత లేదు.అయితే, ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వలసదారుల కలలను దెబ్బతీసేలా మారాయి.
రాబోయే రోజుల్లో అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువస్తుందా లేదా ప్రస్తుతం ఉన్న వెయిటింగ్ వ్యవస్థను కొనసాగిస్తుందా అనే విషయంపై భారతీయ వలసదారులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.