రక్తహీనత.( Anemia ).పిల్లలు మరియు మహిళల్లో ఇది ఎక్కువగా తలెత్తుతుంది.మహిళల్లో నెలసరి ప్రధాన కారణమైతే.
పిల్లల్లో పోషకాల కొరత కారణంగా రక్తహీనత ఏర్పడుతుంది.దీనివల్ల నీరసం విపరీతంగా పెరిగిపోతుంటుంది.
అలసట, ఆయాసం, చర్మం పాలిపోవడం ఇలా రక్తహీనత వల్ల ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి.చాలా మంది రక్తహీనత నుంచి బయటపడడానికి టాబ్లెట్స్ ను వాడుతుంటారు.
అయితే సహజంగా కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.ఇప్పుడు చెప్పబోయే ఆహార నియమాలు పాటిస్తే ఎలాంటి రక్తహీనత అయినా నెల రోజుల్లో పరార్ అవ్వాల్సిందే.
రక్తహీనత సమస్యను దూరం చేయడానికి పాలకూర చాలా అద్భుతంగా సహాయపడుతుంది.పాలకూరలో ఉండే ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.అందుకే వారంలో కనీసం మూడు లేదా నాలుగు సార్లు అయినా పాలకూర డైట్ లో ఉండేలా చూసుకోవాలి. పాలకూరతో జ్యూస్( Palak juice ) తయారు చేసుకుని నిత్యం రోజూ తాగితే ఇంకా మంచిది.

రక్త హీనతను నివారించడానికి జున్ను సహాయపడుతుంది.అవును జున్ను టేస్టీగా ఉండడమే కాదు ఎన్నో పోషకాలను కూడా కలిగి ఉంటుంది.ముఖ్యంగా రక్తహీనత బాధితులు జున్ను కనిపిస్తే అసలు వదిలి పెట్టకండి.అలాగే రక్తహీనతతో బాధపడుతున్న వారు నిత్యం ఒక బీట్ రూట్( Beet root ) క్యారెట్ కలిపి జ్యూస్ తయారు చేసుకుని తాగేయండి.
ఇలా చేస్తే చాలా త్వరగా రక్తహీనత నుంచి బయట పడతారు.

ఆకుకూరలు( Greens ) ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.రక్తహీనతను తరిమి కొట్టడానికి వీటికి ఇవే సాటి.అందుకే వారంలో ఆరు రోజులు కచ్చితంగా ఏదో ఒక ఆకుకూరను తీసుకోండి.
గోంగూర, తోటకూర, మెంతికూర వంటి వాటిని ప్రిఫర్ చేయండి.ఇక కరివేపాకు కూడా రక్తహీనత ను నివారిస్తుంది.
అవును నిత్యం గుప్పెడు కరివేపాకు ను కచ్చాపచ్చాగా దంచి ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకోండి.దీనివల్ల రక్తహీనత పరార్ అవ్వడమే కాదు శరీరంలో అధిక వేడి తొలగిపోతుంది.
నీరసం అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.