ఆడ మగ అనే తేడా లేకుండా మనలో చాలా మందికి పొట్ట చుట్టూ కొవ్వు భారీగా పేరుకుపోయి ఉంటుంది.దాంతో పొట్ట లావుగా మారుతుంది.
బాడీ షేప్ అవుట్ అవుతుంది.ఈ క్రమంలోనే పొట్ట కొవ్వును( Belly fat ) కరిగించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? బాన పొట్టను ఫ్లాట్ గా మార్చుకోవాలని భావిస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ డ్రింక్ మీకు చాలా బాగా సహాయపడుతుంది.రెగ్యులర్ గా ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే పొట్ట కొవ్వు వెన్నలా కరిగిపోతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పవర్ ఫుల్ డ్రింక్ ఏంటో.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు వాము( Ajwain ) వేసుకొని దోరగా వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో రెండు టేబుల్ స్పూన్లు మిరియాల కూడా వేసి 20 సెకండ్ల పాటు వేయించి తీయాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న వాము మరియు మిరియాలు( Pepper ) వేసి మెత్తని పొడి లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.
ఇక స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక అర టీ స్పూన్ తయారు చేసి పెట్టుకున్న పొడి వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసి అర టీ స్పూన్ తేనె( Honey ) కలిపితే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.రోజు ఉదయం లేదా సాయంత్రం వేళ ఈ డ్రింక్ ను సేవించాలి.
తద్వారా పొట్ట చుట్టూ పెరిగిపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.
అలాగే నిత్యం ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది.దాంతో క్యాలరీలు కరిగే ప్రక్రియ వేగంగా మారి తొందరగా వెయిట్ లాస్ అవుతారు.అంతేకాకుండా ఈ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు తొలగిపోతాయి.
నెలసరి సమయంలో వివిధ నొప్పుల నుంచి మహిళలు ఉపశమనం పొందుతారు.మరియు ఈ డ్రింక్ క్యాన్సర్ ముప్పును సైతం తగ్గిస్తుంది.